Share News

PM Modi: 14న మంగళూరుకు ప్రధాని మోదీ.. అదేరోజు బెంగళూరు ఉత్తరలో రోడ్‌షో.. మండ్యలో ప్రచారానికి రాహుల్‌..

ABN , Publish Date - Apr 11 , 2024 | 12:45 PM

తొలివిడత ప్రచారం మలివిడత నామినేషన్ల హోరు రాష్ట్రంలో ఎన్నికల వేడి పెంచుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించారు. నామినేషన్లకు ముందే ఒక విడత ప్రచారం ముగించిన ప్రధాని మరో పది రోజుల్లో రెండుసార్లు రాష్ట్ర పర్యటనకు వస్తున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

PM Modi: 14న మంగళూరుకు ప్రధాని మోదీ.. అదేరోజు బెంగళూరు ఉత్తరలో రోడ్‌షో.. మండ్యలో ప్రచారానికి రాహుల్‌..

- రాష్ట్రంలో హోరెత్తనున్న ప్రచారం

బెంగళూరు: తొలివిడత ప్రచారం మలివిడత నామినేషన్ల హోరు రాష్ట్రంలో ఎన్నికల వేడి పెంచుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించారు. నామినేషన్లకు ముందే ఒక విడత ప్రచారం ముగించిన ప్రధాని మరో పది రోజుల్లో రెండుసార్లు రాష్ట్ర పర్యటనకు వస్తున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల వేళ కన్నడిగులను ఆకట్టుకునేలా మోదీ ‘ఎక్స్‌’లో ‘నమో కన్నడ’ పేరిట ప్రత్యేక ఖాతాను తెరిచారు. రాష్ట్రంలో ప్రతి ఓటరుకు ప్రధాని ప్రసంగాలు, సమాచారం చేరవేసేలా ‘నమో కన్నడ’ ఖాతాకు శ్రీకారం చుట్టారు. ఈనెల 14న ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రానికి వస్తున్నారు. సాయంత్రం మంగళూరు(Mangalore)లో రోడ్‌షోలో పాల్గొంటారు. వాస్తవానికి మంగళూరు బహిరంగసభలో ప్రధాని పాల్గొనాల్సి ఉండేది, కానీ కేవలం రోడ్‌షోకే ప్రధాని కార్యక్రమాన్ని మార్పు చేశారు. బెంగళూరు, చిక్కబళ్లాపుర నగరాలలోనూ ప్రధాని రోడ్‌షో జరగనుంది. బెంగళూరు ఉత్తర పరిధిలోని బ్యాటరాయనపుర, హెబ్బాళ శాసనసభ నియోజకవర్గాల పరిధిలో రోడ్‌షో ఉంటుంది. కాగా ప్రధాని మోదీ మూడో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా రామనగరలో రోడ్‌షోలో పాల్గొననున్నారు. ఈనెల 19 లేదా 20 తేదీలలో రామనగరకు వచ్చి బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ సీఎన్‌ మంజునాథ్‌ తరపున ప్రచారం చేయనున్నారు. ఇదే సమావేశంలో జేడీఎస్‌ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడ పాల్గొంటారు.

రామనగరలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేయనున్నారు.

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి రానున్నారు. ఈనెల 17 లేదా 20 తేదీలలో రాహుల్‌గాంధీ, మండ్య అభ్యర్థి వెంకట రమణగౌడ అలియాస్‌ స్టార్‌ చంద్రు తరపున ప్రచారం చేయనున్నారు. రాహుల్‌ పాల్గొనే బహిరంగసభకు పెద్దఎత్తున ప్రజలు పాల్గొంటారని మండ్య ఎమ్మెల్యే రవికుమార్‌ గణిగ తెలిపారు. రాహుల్‌గాంధీతోపాటు సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్‌, నటి, మాజీ ఎంపీ రమ్య కూడా పాల్గొంటారన్నారు. రాహుల్‌గాంధీ ఆ తర్వాత పలు బహిరంగసభలలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇదికూడా చదవండి: BJP MLAs: బీజేపీ ఎమ్మెల్యేలు... కాంగ్రెస్‌కు ప్రచారం..!

Updated Date - Apr 11 , 2024 | 12:58 PM