Share News

Supreme Court: ఎస్బీఐ బాండ్ల కేసులో ఉత్తర్వులు పాటించకుంటే ధిక్కరణ చర్యలు

ABN , Publish Date - Mar 11 , 2024 | 02:21 PM

ఎలక్టోరల్ బాండ్ల వివరాలను రేపు ఎన్నికల కమిషన్‌కు సమర్పించాల్సిందేనని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుపీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. బాండ్ల వివరాలు తెలియజేసేందుకు తాము మరింత సమయం ఇవ్వాలని ఎస్బీఐ తరఫున హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. అందుకు సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం తిరస్కరించింది.

Supreme Court: ఎస్బీఐ బాండ్ల కేసులో ఉత్తర్వులు పాటించకుంటే ధిక్కరణ చర్యలు

ఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల వివరాలను రేపు ఎన్నికల కమిషన్‌కు సమర్పించాల్సిందేనని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుపీంకోర్టు (Supreme Court) ధర్మాసనం స్పష్టం చేసింది. బాండ్ల వివరాలు తెలియజేసేందుకు తాము మరింత సమయం ఇవ్వాలని ఎస్బీఐ (sbi) తరఫున హరీష్ సాల్వే (Harish Salve) వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు (Supreme Court) సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. రేపు ఈసీకి సమర్పించాలని, 15వ తేదీ లోపు సాయంత్రం 5 గంటల్లోపు ఎన్నికల సంఘం వెబ్ సైట్‌లో వివరాలు అప్ లోడ్ చేయాలని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది.

ఎస్బీఐ బాండ్ల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఎస్బీఐకి చెంప పెట్టు లాంటిదని సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ అభిప్రాయ పడ్డారు. కోర్టు ఉత్తర్వులకు సంబంధించి ఎస్బీఐ చైర్మన్ అఫిడవిట్ ఫైల్ చేయాలని కోరారు. కోర్టు ఉత్తర్వులు పాటించకకుంటే ధిక్కరణ చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. 2019 ఏప్రిల్ 12వ తేదీతో ఉన్న ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎస్బీఐ తెలియజేయాల్సి ఉంది. ఎలక్టోరల్ బాండ్ కొనుగోలు చేసిన తేదీ, పేరు, బాండ్ విలువ, బాండ్ రిడీమ్ చేసుకున్న పార్టీ వివరాలు, తేదీ వెల్లడించాల్సి ఉంది. అందుకోసం ఎస్బీఐ సమయం కోరగా, సుప్రీం కోర్టు నిరాకరించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 11 , 2024 | 02:21 PM