Share News

University: వైఫై కోసం రూ.67.71 కోట్లు.. ఎక్కడంటే..?

ABN , Publish Date - Mar 07 , 2024 | 10:34 AM

ఢిల్లీ యూనివర్సిటీ కీలక నిర్ణయం తీసుకుంది. తన పరిధిలో గల అన్ని కాలేజీ క్యాంపస్‌లలో వైఫై ఏర్పాటు చేస్తామని ప్రకటన చేసింది. రూ.67.71 కోట్ల నిధులను ఖర్చు చేయనుంది. ఢాకా హాస్టల్ కాంప్లెక్స్ సహా ఉత్తర, దక్షిణ క్యాంపస్‌లో గల 90 కాలేజీలకు వైఫై ఏర్పాటు చేస్తారు.

University: వైఫై కోసం రూ.67.71 కోట్లు.. ఎక్కడంటే..?

ఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ (Delhi University) కీలక నిర్ణయం తీసుకుంది. తన పరిధిలో గల అన్ని కాలేజీ క్యాంపస్‌లలో (Campus) వైఫై ఏర్పాటు చేస్తామని ప్రకటన చేసింది. రూ.67.71 కోట్ల నిధులను ఖర్చు చేయనుంది. ఢాకా హాస్టల్ కాంప్లెక్స్ సహా ఉత్తర, దక్షిణ క్యాంపస్‌లో గల 90 కాలేజీలకు వైఫై ఏర్పాటు చేస్తారు. త్వరలో ఏర్పాటు చేయబోయే వాయవ్య ఢిల్లీలో గల ముఖర్జీ నగర్ గర్ల్స్ హాస్టల్‌లో కూడా వైఫ్ సదుపాయం కల్పిస్తారు.

వైఫై ఏర్పాటు కోసం వ్యయం చేసే నగదును ఉన్నత విద్య ఫైనాన్సింగ్ ఏజెన్సీ (HEFA) అందజేసింది. ఢిల్లీ వర్సిటీకి హెచ్ఈఎఫ్ఏ గత ఏడాది రూ.938.33 కోట్ల నిధులు అందజేసింది. ఆ నిధులను వివిధ అభివృద్ధి పనుల కోసం ఉపయోగించాలని కోరింది. రూ.261.33 కోట్ల నిధులను వైఫై నెట్ వర్క్ ఏర్పాటు కోసం, ఫ్యాకల్టీ ఆఫ్ టెక్నాలజీ భవన నిర్మాణం కోసం ఉపయోగించేందుకు హెచ్ఈఎఫ్ఏ అంగీకరించింది. దాంతో వైఫ్ కోసం రూ.67.71 కోట్లు ఖర్చు చేస్తున్నారు.

కేంద్ర విద్యాశాఖ, కెనరా బ్యాంక్ సహాకారంతో హెచ్ఈఎఫ్ఏ దేశంలో గల ప్రముఖ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పన, పరిశోధన సౌకర్యాల కోసం ఆర్థిక సాయం అందచేస్తోంది. అందులో భాగంగా ఢిల్లీ వర్సిటీకి ఆర్థిక సహకారం అందజేసింది.

మరిన్ని విద్యా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 07 , 2024 | 10:34 AM