Share News

Bomb Threats: ఒకేసారి పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. తర్వాత ఏమైందంటే

ABN , Publish Date - May 01 , 2024 | 09:08 AM

దేశ రాజధాని ఢిల్లీ(delhi)లోని ద్వారక(Dwarka)లో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (DPS)కి బాంబు బెదిరింపులు వచ్చాయి. తూర్పు ఢిల్లీలోని మయూర్ విహార్‌లోని మదర్ మేరీ స్కూల్‌కు కూడా బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఢిల్లీ పోలీసులు, పాఠశాల యంత్రాంగం అప్రమత్తమైంది.

Bomb Threats: ఒకేసారి పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. తర్వాత ఏమైందంటే
Delhi Public School Noida has received an email that bomb threat

దేశ రాజధాని ఢిల్లీ(delhi)లోని ద్వారక(Dwarka)లో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (DPS)కి బాంబు బెదిరింపులు వచ్చాయి. తూర్పు ఢిల్లీలోని మయూర్ విహార్‌లోని మదర్ మేరీ స్కూల్‌కు కూడా బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఢిల్లీ పోలీసులు, పాఠశాల యంత్రాంగం అప్రమత్తమైంది. ముందుజాగ్రత్తగా పిల్లలను బయటకు పంపించారు. వెంటనే పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుని బెదిరింపు ఘటనలపై వివరాలను సేకరిస్తున్నారు.


అయితే పోలీసులు(police) తెలిపిన వివరాల ప్రకారం ద్వారకలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు బెదిరింపు మెయిల్ వచ్చింది. అందులో పాఠశాలలో బాంబు ఉందని రాసి ఉంది. ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలను ఖాళీ చేయించారు. ఢిల్లీ పోలీసులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, అగ్నిమాపక దళం ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అన్వేషణ కొనసాగుతోంది. అయితే పోలీసులకు ఇంకా ఏమీ దొరకలేదు.


అదే సమయంలో తూర్పు ఢిల్లీలోని మయూర్ విహార్‌లో ఉన్న మదర్ మేరీ స్కూల్‌కు కూడా ఈ ఉదయం బాంబు బెదిరింపు ఇమెయిల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. పాఠశాలను ఖాళీ చేయించి పాఠశాల పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అదే సమయంలో ఈరోజు ఉదయం సంస్కృతి స్కూల్‌(Sanskriti School)కు కూడా బాంబు బెదిరింపు గురించి ఇమెయిల్ వచ్చింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు పాఠశాల ఆవరణలో ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు. ఈ బెదిరింపు ఘటనలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


ఇది కూడా చదవండి:

LPG Gas: గుడ్ న్యూస్.. తగ్గిన ఎల్‌పీజీ గ్యాస్ ధర

Abhibus : ఓటర్ల కోసం అభిబస్‌ ప్రత్యేక ఆఫర్‌

Read Latest National News and Telugu News

Updated Date - May 01 , 2024 | 09:12 AM