Share News

Abhibus : ఓటర్ల కోసం అభిబస్‌ ప్రత్యేక ఆఫర్‌

ABN , Publish Date - May 01 , 2024 | 05:24 AM

ఆన్‌లైన్‌ బస్‌-టికెటింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అభిబస్‌.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని ఓటర్ల కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల కోసం అభివోట్‌ పేరుతో ఈ ఆఫర్‌ను తీసుకువచ్చినట్లు అభిబస్‌ సీఈఓ లెనిన్‌

Abhibus : ఓటర్ల కోసం అభిబస్‌ ప్రత్యేక ఆఫర్‌

హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ బస్‌-టికెటింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అభిబస్‌.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని ఓటర్ల కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల కోసం అభివోట్‌ పేరుతో ఈ ఆఫర్‌ను తీసుకువచ్చినట్లు అభిబస్‌ సీఈఓ లెనిన్‌ కోడూరు, సీఓఓ రోహిత్‌ శర్మ తెలిపారు. ఈ ఆఫర్‌లో భాగంగా ప్రతి టికెట్‌ కొనుగోలుపై రూ.100 క్యాష్‌బ్యాక్‌తో పాటు 20 శాతం నుంచి రూ.250 వరకు డిస్కౌంట్‌ను అందించనున్నట్లు చెప్పారు. ఈ ఆఫర్‌ మే 11 నుంచి 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఆన్‌లైన్‌ బస్‌ టికెట్‌ విభాగంలో అభిబస్‌ 12.5 శాతం మార్కెట్‌ కలిగి ఉందని, తమ ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఏపీ, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలతో పాటు 2,000 మంది ప్రైవేట్‌ బస్‌ ఆపరేటర్లు సేవలందిస్తున్నారని తెలిపారు.

Updated Date - May 01 , 2024 | 05:24 AM