Share News

CWC Meeting:ఢిల్లీలో ప్రారంభమైన కాంగ్రెస్ కీలక భేటీ.. ఆ అంశాలపైనే ప్రధాన చర్చ..!

ABN , Publish Date - Mar 19 , 2024 | 09:53 AM

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) ఢిల్లీలో సమావేశమైంది. లోక్‌సభ అభ్యర్థుల ఎంపికతో పాటు.. పార్టీ మేనిఫెస్టో(Manifesto)పై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రను అభినందిస్తూ సీడబ్ల్యూసీ తీర్మానం చేయనుంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రజాకర్షక మేనిఫెస్టోను రూపొందించడమే లక్ష్యంగా ఈ సమావేశం జరుగుతోంది.

CWC Meeting:ఢిల్లీలో ప్రారంభమైన కాంగ్రెస్ కీలక భేటీ.. ఆ అంశాలపైనే ప్రధాన చర్చ..!

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) ఢిల్లీలో సమావేశమైంది. లోక్‌సభ అభ్యర్థుల ఎంపికతో పాటు.. పార్టీ మేనిఫెస్టో(Manifesto)పై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రను అభినందిస్తూ సీడబ్ల్యూసీ తీర్మానం చేయనుంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రజాకర్షక మేనిఫెస్టోను రూపొందించడమే లక్ష్యంగా ఈ సమావేశం జరుగుతోంది. ఇటీవల హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో మేనిఫెస్టోతోనే అధికారంలోకి రాగలిగామనే విశ్వాసంతో ఉన్న కాంగ్రెస్ (Congress) పార్టీ దేశ ప్రజల విశ్వాసం పొందేలా ప్రణాళికను సిద్ధం చేయాలని భావిస్తోంది. అలాగే కాంగ్రెస్‌పై బీజేపీ వ్యతిరేక ప్రచారానికి ఎలా అడ్డుకట్ట వేయాలి.. ఇండియా కూటమి బలోపేతానికి ఎలాంటి వ్యూహాలు రచించాలనేదానిపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీడబ్ల్యూసీలో చర్చించేందుకు ఎన్నో అంశాలు ఉన్నప్పటికీ ప్రధానంగా ఎన్నికల వేళ మేనిఫెస్టోపైనే ఫోకస్ చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మొదటి దశలో 18 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలి ప్రాంతాల్లో జరిగే తొలిదశ ఎన్నికల కోసం పెండింగ్‌లో ఉన్న అభ్యర్థుల ఎంపికపై చర్చించి.. సాయంత్రం జరగనున్న కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఆ పేర్లకు ఆమోద వేయనున్నట్లు తెలుస్తోంది.

ఎలక్టోరల్ బాండ్లపై..

దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న ఎలక్టోరల్ బాండ్ల అంశం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసే అవకాశాలున్నాయి. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో సుప్రీంకోర్టు ఎస్‌బీఐపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో.. కేంద్రప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తీర్మానం చేయనున్నట్లు తెలుస్తోంది. 2019 ఏప్రియల్ 12 నుంచి ఈఏడాది ఫిబ్రవరి `5 వరకు 1260 కంపెనీలు, వ్యక్తులు రూ.12,155.51 కోట్ల విలువైన 22వేల 217 బాండ్లను కొనుగోలు చేసినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించిన విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 19 , 2024 | 10:12 AM