Share News

PM Modi: ఇందిరా సర్కార్ కచ్చతీవులను లంకకు అప్పగించింది: ప్రధాని మోదీ

ABN , Publish Date - Mar 31 , 2024 | 01:46 PM

ఇందిరాగాంధీ హయాంలో జరిగిన కీలక తప్పిదం కచ్చతీవు దీవులను శ్రీలంకకు అప్పగించడం అని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ సమగ్రత, దేశ ప్రయోజనాలను ఆనాటి ప్రభుత్వం లెక్క చేయలేదని మోదీ ధ్వజమెత్తారు. సమాచార హక్కు చట్టం కింద కచ్చతీవు దీవుల ద్వీపాన్ని శ్రీలంకు ఎలా అప్పగించిందనే వివరాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

PM Modi: ఇందిరా సర్కార్ కచ్చతీవులను లంకకు అప్పగించింది: ప్రధాని మోదీ

ఢిల్లీ: ఇందిరాగాంధీ (Indira Gandhi) హయాంలో జరిగిన కీలక తప్పిదం కచ్చతీవు దీవులను శ్రీలంకకు అప్పగించడం అని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) విరుచుకుపడ్డారు. దేశ సమగ్రత, దేశ ప్రయోజనాలను ఆనాటి సర్కార్ పట్టించుకోలేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై కచ్చతీవు దీవుల ద్వీపాన్ని శ్రీలంకకు (Sri Lanka) ఎలా అప్పగించిందనే విషయాన్ని సమాచార హక్కు చట్టం కింద తెలుసుకున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ ఆ అంశాన్ని ప్రస్తావించారు.

భారతీయుడికి కోపం తెప్పిస్తోంది

‘కళ్లు తెరిపించే, ఆశ్చర్యకర చర్యలు ప్రపంచానికి తెలిశాయి. కచ్చతీవు దీవులను కాంగ్రెస్ పార్టీ ఎలా వదులుకుందో ఇప్పుడు తెలిసింది. ఈ చర్య ప్రతి భారతీయుడికి కోపం తెప్పిస్తోంది. కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ విశ్వసించలేం. దేశ ఐక్యత, సమగ్రత, ప్రయోజనాలను బలహీన పరచడం ఆ పార్టీ విధానం. 75 ఏళ్లు దేశాన్ని ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ పాలించింది అని’ ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు.

మత్స్యకారుల అరెస్ట్

వేసవి కావడంతో భారత జలాల్లో చేపలు తగ్గిపోతున్నాయి. రామేశ్వరం, సమీప జిల్లాలకు చెందిన మత్స్యకారులు చేపలు పట్టేందుకు కచ్చతీవు ద్వీపానికి వెళుతున్నారు. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ దాటి వెళ్లడంతో శ్రీలంక నౌకాదళం అదుపులోకి తీసుకుంది. దాంతో సమస్య వెలుగులోకి వచ్చింది. ఆ వెంటనే ఆర్టీఐ ద్వారా సమాచారం బయటకు వచ్చింది. ఆ అంశాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఆ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పింద మత్స్యకారుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఇది కూడా చదవండి:

Whatsapp: వాట్సాప్‌ అడ్మిన్ల జాబితా సేకరణలో పార్టీల నేతలు

Updated Date - Mar 31 , 2024 | 01:51 PM