Share News

Alert: ఎన్నికల వేళ మరో కుట్రకు తెరలేపుతున్న చైనా.. మైక్రోసాఫ్ట్ హెచ్చరిక

ABN , Publish Date - Apr 06 , 2024 | 11:56 AM

చైనా(china) వక్రబుద్ది అస్సలు మారడం లేదు. కుక్క తోక వంకర అన్నట్లుగా తయారైంది. భారత్ విషయంలో గతంలో పలు మార్లు దూకుడు చర్యలకు దిగిన డ్రాగన్ దేశం ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల(elections) వేళ మరోసారి తన వంకర బుద్దిని చూపించాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో దుశ్చర్యకు పాల్పడేందుకు చైనా సిద్ధమవుతుందని ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్(Microsoft) ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

Alert: ఎన్నికల వేళ మరో కుట్రకు తెరలేపుతున్న చైనా.. మైక్రోసాఫ్ట్ హెచ్చరిక
China is another conspiracy ai content

చైనా(china) వక్రబుద్ది అస్సలు మారడం లేదు. కుక్క తోక వంకర అన్నట్లుగా తయారైంది. భారత్ విషయంలో గతంలో పలు మార్లు దూకుడు చర్యలకు దిగిన డ్రాగన్ దేశం ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల(elections) వేళ మరోసారి తన వంకర బుద్దిని చూపించాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో దుశ్చర్యకు పాల్పడేందుకు చైనా సిద్ధమవుతుందని ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్(Microsoft) ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అయితే అసలు చైనా ఏం చేయాలని భావిస్తోందనేది ఇక్కడ తెలుసుకుందాం.


భారతదేశంలో(bharat) 2024 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఇప్పటికే ప్రకటించబడ్డాయి. ఏప్రిల్ 19 నుంచి మొదటి దశ లోక్‌సభ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ విడుదల చేసిన నివేదిక ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో జోక్యం చేసుకోవడానికి చైనా హ్యాకర్లు కృత్రిమ మేధస్సు (AI)ని ఉపయోగించేందుకు సిద్ధమవుతున్నారని నివేదిక తెలిపింది. ఆ విధంగా AI ద్వారా రూపొందించిన కంటెంట్ భారత్ సహా అమెరికా(america), దక్షిణ కొరియా వంటి దేశాల ఎన్నికలపై కూడా ప్రభావం చూపుతుందని టెక్ దిగ్గజం హెచ్చరించింది.


ఎన్నికల సమయంలో ప్రజాభిప్రాయాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా AI రూపొందించిన కంటెంట్‌ను ప్రొడ్యూస్ చేసి, పంపిణీ చేయనుందని మైక్రోసాఫ్ట్(Microsoft) నివేదిక(report) తెలిపింది. ఈ క్రమంలో AI రూపొందించిన కంటెంట్ మీమ్స్, వీడియోలు, ఆడియోల రూపంలో ఉంటుందని చెప్పింది. దీని ప్రధాన ఉద్దేశం చైనాకు అనుకూలంగా మార్చుకోవడం లేదా ఇతర చర్యలకు పాల్పడనుందని చెప్పింది. అయితే ఈ అంశాలు సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం తక్కువేనని ప్రస్తావించింది.


ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా(World wide) AI వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఇది అపరిమిత కంటెంట్‌ను సృష్టించడానికి సహాయపడుతుంది. అయితే దీనిని కొంతమంది తప్పుడు విషయాల కోసం ఉపయోగిస్తున్నారని నివేదిక తెలిపింది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో ఏఐ కంటెంట్ ప్రజలను కొంత మేర ప్రభావితం చేయనుందని నివేదిక గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించడం ప్రభుత్వానికి సవాలేనని వెల్లడించింది. దీంతోపాటు అలాంటి కంటెంట్ విషయంలో ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. దేశంలో 17వ లోక్‌సభ ఎన్నికలు ఈసారి 7 దశల్లో జరగనున్నాయి. దాని ఫలితాలు జూన్ 4న ప్రకటించబడతాయి.


ఇది కూడా చదవండి:

Hyd to Goa: కేవలం రూ.425తోనే గోవా ట్రిప్.. మీ వారితో కలిసి చుట్టేయండి


Manifesto : పాంచ్‌ న్యాయ్‌.. పచ్చీస్‌ గ్యారెంటీ


పాక్‌ ఉగ్రవాదులపై ‘రా’ గురి!


మరిన్ని జాతీయ వార్తల కోసం

Updated Date - Apr 06 , 2024 | 12:17 PM