Share News

Chennai: కొత్తరకం కరోనా వైరస్‏పై ఆందోళన వద్దు...

ABN , Publish Date - May 22 , 2024 | 11:18 AM

సింగపూర్‌లో తాజాగా వ్యాపిస్తున్న కొత్త రకం కరోనా వైరస్‌(Corona virus), రాష్ట్రంలో ఇదివరకే వ్యాపించిన జేఎన్‌1 రకం వైరస్‌ రూపాంతరమేనని, అందువల్ల కొత్త రకం వైర్‌సతో భయపడాల్సిన అవసరం లేదని ఆరోగ్యశాఖ ప్రకటించింది.

Chennai: కొత్తరకం కరోనా వైరస్‏పై ఆందోళన వద్దు...

- ఆరోగ్యశాఖ

చెన్నై: సింగపూర్‌లో తాజాగా వ్యాపిస్తున్న కొత్త రకం కరోనా వైరస్‌(Corona virus), రాష్ట్రంలో ఇదివరకే వ్యాపించిన జేఎన్‌1 రకం వైరస్‌ రూపాంతరమేనని, అందువల్ల కొత్త రకం వైర్‌సతో భయపడాల్సిన అవసరం లేదని ఆరోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో రెండేళ్లుగా కరోనా వ్యాప్తి పూర్తిగా నియంత్రణలోకి వచ్చింది. ప్రస్తుతం చెన్నై, తిరువళ్లూర్‌, కాంచీపురం, చెంగల్పట్టు, కోయంబత్తూర్‌, తిరుప్పూర్‌, ఈరోడ్‌ తదితర జిల్లాలకు చెందిన 14 మంది మాత్రమే కరోనా స్వల్ప లక్షణాలతో చికిత్స పొందుతున్నారు.

ఇదికూడా చదవండి: Kharge : హిందూ-ముస్లింల మధ్య మోదీ చిచ్చు


ఈ నేపథ్యంలో, సింగపూర్‌(Singapore) దేశంలో కొత్త రకం కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా, ఒకే వారంలో 26,000 మందికి ఈ లక్షణాలు నిర్ధారణ అయ్యాయి. దీంతో, ఈ కొత్త రకం వైర్‌సను నియంత్రించేలా ప్రజలందరూ తప్పకుండా మాస్క్‌లు ధరించాలని ఆ దేశ ప్రభుత్వం ఆదేశించింది. తమిళనాడు-సింగపూర్‌(Tamil Nadu-Singapore) మధ్య పారిశ్రామికంగా, వాణిజ్య పరంగా మంచి సంబంధాలుండడంతో వందలాదిమంది తరచూ ప్రయాణిస్తుంటారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 22 , 2024 | 11:27 AM