Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్ పేలుడు, రంగంలోకి ఎన్ఐఏ

ABN , Publish Date - Mar 04 , 2024 | 11:03 AM

రామేశ్వరం కేఫ్ (Rameshwaram Cafe) పేలుడుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. పేలుడు ఘటనను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారిస్తున్నారు. పేలుడు ఘటన విచారణను ఎన్ఐఏకు అప్పగించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆదివారం నాడు ప్రకటన చేశారు. ఆ వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించింది. పేలుడు ఘటనను ఎన్ఐఏకు ఇస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది.

Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్ పేలుడు, రంగంలోకి ఎన్ఐఏ

ఢిల్లీ: బెంగళూర్‌ వైట్ ఫీల్డ్‌లో బిజీగా ఉండే రామేశ్వరం కేఫ్ (Rameshwaram Cafe) వద్ద ఇటీవల జరిగిన బ్లాస్ట్‌తో ఒక్కసారిగా కలకలం రేగింది. పేలుడు జరిగిన వ్యక్తి కోసం పోలీసు బృందాలు విసృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. సీసీటీవీ ఫుటేజీలో ఓ వ్యక్తిని గుర్తించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయం ఆధారంగా అతనిని గుర్తిస్తామని పోలీసులు ప్రకటించారు. ఐఈడీ బాంబ్ పేలడం, బెంగళూర్ (Bengalure) నడిబొడ్డున ఘటన జరగడంతో జాతీయ భద్రతా సంస్థ (NIA) రంగంలోకి దిగింది. కేంద్ర హోం శాఖ ఆదేశాలతో ఎన్ఐఏ అధికారులు విచారణ ప్రారంభించారు.

రామేశ్వరం కేఫ్ (Rameshwaram Cafe) పేలుడుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. పేలుడు ఘటనను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారిస్తున్నారు. పేలుడు ఘటన విచారణను ఎన్ఐఏకు అప్పగించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆదివారం నాడు ప్రకటన చేశారు. ఆ వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించింది. పేలుడు ఘటనను ఎన్ఐఏకు ఇస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది.

మార్చి 1వ తేదీ శుక్రవారం నాడు రామేశ్వరం కేఫ్ వద్ద పేలుడు జరిగింది. ఓ వ్యక్తి వచ్చి టిఫిన్ ఆర్డర్ చేశాడు. ఫుడ్ తీసుకొని టేబుల్ వద్దకొచ్చాడు. అక్కడ టిఫిన్, బ్యాగ్ వదిలి వెళ్లాడు. ఆ తర్వాతే పేలుడు జరిగింది. సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 04 , 2024 | 11:04 AM