Share News

LPG Gas Cylinder Price: ఉజ్వల పథకం లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. మరో ఏడాది పాటు..

ABN , Publish Date - Mar 07 , 2024 | 10:27 PM

LPG Gas Cylinder Price: ఉజ్వల పథకం లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎల్‌పిజి సిలిండర్‌పై(LPG Cylinder) ప్రభుత్వం ఇస్తున్న రూ. 300 సబ్సిడీని మరొక సంవత్సరం పాటు పొడగించింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన(PMUY) పథకం కింద 14.2 కిలోల ఎల్‌పిజి సిలిండర్‌పై రూ. 300 సబ్సిడీని మరో ఏడాది పాటు పొడగిస్తున్నట్లు ప్రకటించింది.

LPG Gas Cylinder Price: ఉజ్వల పథకం లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. మరో ఏడాది పాటు..
LPG Gas Cylinder Price

LPG Gas Cylinder Price: ఉజ్వల పథకం లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎల్‌పిజి సిలిండర్‌పై(LPG Cylinder) ప్రభుత్వం ఇస్తున్న రూ. 300 సబ్సిడీని మరొక సంవత్సరం పాటు పొడగించింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన(PMUY) పథకం కింద 14.2 కిలోల ఎల్‌పిజి సిలిండర్‌పై రూ. 300 సబ్సిడీని మరో ఏడాది పాటు పొడగిస్తున్నట్లు ప్రకటించింది. గురువారం నాడు ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేసింది. మార్చి 7 2024 నుంచి మార్చి 31, 2025 వరకు ఈ సబ్సిడీ వర్తిస్తుందని ప్రకటనలో కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

పీఎంయూవై లబ్ధిదారులకు ఒక్కో సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ ఏడాదికి 12 రీఫిల్స్‌కు అందించడం జరుగుతుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. మార్చి 1, 2024 నాటికి 10.27 కోట్లకు పైగా PMUY లబ్ధిదారులకు లబ్ధి చేకూరిందన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో ఉజ్వల లబ్ధిదారులకు ఎల్‌పిజి సిలిండర్‌పై సబ్సిడీ మొత్తాన్ని రూ. 200 నుంచి రూ. 300 పెంచింది కేంద్ర ప్రభుత్వం. సబ్సిడీ కొనసాగింపు కారణంగా కేంద్ర ప్రభుత్వంపై ఏడాదికి రూ. 12,000 కోట్లు వ్యయం అవుతుందన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 07 , 2024 | 10:27 PM