Share News

Bengaluru CEO: తల్లి కాదు రక్కసి, కన్న కొడుకునే చంపింది.. ఎందుకంటే..?

ABN , Publish Date - Jan 09 , 2024 | 03:50 PM

భర్తతో విభేదాలతో ఓ మహిళ మాతృత్వానికి మచ్చ తీసుకొచ్చింది. కన్న కుమారుడినే హతమార్చింది. వెకేషన్ అని ఆ బాబుకి చెప్పి గోవాకు తీసుకెళ్లింది.

 Bengaluru CEO: తల్లి కాదు రక్కసి, కన్న కొడుకునే చంపింది.. ఎందుకంటే..?

బెంగళూర్: భర్తతో విభేదాలతో ఓ మహిళ మాతృత్వానికి మచ్చ తీసుకొచ్చింది. కన్న కుమారుడినే హతమార్చింది. వెకేషన్ అని ఆ బాబుకి చెప్పి తీసుకెళ్లింది. గోవాలో ఈ విషాద ఘటన జరిగింది. కుమారుడిని హత్య చేసింది సుచనా సేథ్‌ (Suchana Seth). ఓ స్టార్టప్ కంపెనీ సీఈవోగా ఉన్నారు. వ్యక్తిగత జీవితంలో డిస్టర్బెన్స్ వల్ల సైకోలా మారింది.

సుచనా సేథ్‌కు 2010లో వివాహాం జరిగింది. పెళ్లైన తర్వాత దంపతులు బాగానే ఉన్నారు. 2019లో వారికి బాబు జన్మించాడు. తర్వాత భార్య భర్తలకు పడలేదు. మరుసటి ఏడాది విడాకులు తీసుకున్నారు. కుమారుడిని కలిసేందుకు అనుమతి ఇచ్చింది. ఆదివారం బాబును కలిసే అవకాశం వచ్చింది. ఆ విషయం సుచనాకు (Suchana Seth) ఎంతమాత్రం నచ్చలేదు. గత ఆదివారం భర్త కుమారుడిని కలిసేందుకు ఇష్టపడలేదు. కొడుకుని తీసుకొని గోవా (Goa) వెళ్లింది.

ఒక ఆదివారం తప్పితే మరో వారం అయినా కుమారుడి వద్దకు తండ్రి వస్తాడు. జీవితంలో అతని మొహం చూడొద్దని నిర్ణయం తీసుకుంది సుచనా. బలహీన మైన క్షణంలో హోటల్ గదిలో తన కుమారుడిని చంపేసింది. అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రణాళిక రచించింది. హోటల్ గదిలోకి బాబుతో వెళ్లి తర్వాత ఒంటరిగా రావడంతో సందేహాలకు తావిచ్చింది. పైగా హోటల్ సిబ్బందికి ఫోన్ చేసి బెంగళూర్‌కు క్యాబ్ బుక్ చేయమని కోరింది. చెక్ అవుట్ అయిన తర్వాత గదిని శుభ్రపరిచే సమయంలో సిబ్బందికి ఎర్రగా కనిపించింది. దాంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సుచనా గురించి మొత్తం చెప్పారు.

హోటల్ సిబ్బంది క్యాబ్ డ్రైవర్ నంబర్ పోలీసులకు ఇచ్చారు. వారు ఫోన్ చేసి సుచనాతో మాట్లాడారు. బాబు గురించి అడగగా స్నేహితుడి ఇంటి వద్ద ఉన్నాడని చెప్పింది. ఎక్కడ అని గదమాయించగా అడ్రస్ తెలిపింది. అక్కడికి వెళ్లి చూడగా బాబు కనిపించలేదు. పోలీసులు మరోసారి క్యాబ్ డ్రైవర్‌కు ఫోన్ చేశారు. సమీపంలో ఉన్న పోలీసు స్టేషన్‌కు వెళ్లాలని స్పష్టంచేశారు. కర్ణాటకలో గల చిత్రదుర్గ పోలీస్ స్టేషన్‌కు కారు తీసుకెళ్లాడు. అక్కడ ఉన్న పోలీసులకు అప్పటికే సమాచారం అందించారు. కారు రాగానే సుచనా బ్యాగ్ తీసుకొని చూశారు. అందులో బాబు మృతదేహాం కనిపించింది. సుచనాను అరెస్ట్ చేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 09 , 2024 | 05:49 PM