Share News

Hydrabad: చట్నీ విషయంలో తలెత్తిన గొడవ.. భర్త అలిగాడని భార్య సూసైడ్..

ABN , Publish Date - Jan 09 , 2024 | 08:59 AM

భార్యాభర్తల బంధం అపురూపమైంది. దాంపత్య జీవితంలో ఆలూమగల మధ్య గొడవలు సర్వసాధారణం. చిన్న చిన్న చికాకులు లేని

Hydrabad: చట్నీ విషయంలో తలెత్తిన గొడవ.. భర్త అలిగాడని భార్య సూసైడ్..

భార్యాభర్తల బంధం అపురూపమైంది. దాంపత్య జీవితంలో ఆలూమగల మధ్య గొడవలు సర్వసాధారణం. చిన్న చిన్న చికాకులు లేని దంపతులు ఉండటం చాలా అరుదు. భార్యాభర్తలన్నాక అవసరాన్ని, సందర్భాన్ని బట్టి సర్దుకుపోవాలి. కానీ.. కొంత మంది మాత్రం అనాలోచితంగా ప్రవర్తిస్తూ చిన్న చిన్న వాటికే మనస్తాపానికి గురవుతున్నారు. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా.. చట్నీ ఎక్కువైందని జరగిన గొడవలో భర్త అలగడంతో భార్య మనస్తాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌ మండలంలోని గోప తండాకు చెందిన రమణకు ఖమ్మం జిల్లా పెగళ్లపాడుకు చెందిన బానోతు చందనతో రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారింది. ఇంట్లో వాళ్లూ వీరి ప్రేమను ఒప్పుకుని వివాహం జరిపించారు. ప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ వద్ద రమణ డ్రైవర్‌ గా పని చేస్తుండగా.. చందన ఓ జ్యువెలరీ షాపులో పని చేస్తోంది. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 2 లోని అపార్ట్‌మెంట్‌లో వీరు నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి భోజనం చేస్తున్న సమయంలో చట్నీ ఎక్కువ వేశావంటూ రమణ తన భార్యతో గొడవపడ్డాడు. దీంతో చందన తీవ్ర మనస్తాపానికి గురైంది.


సోమవారం ఉదయం రమణ డ్యూటీకి వెళ్లిన తర్వాత చందన అతనికి పలు మార్లు వీడియో కాల్స్ చేసింది. అయినప్పటికీ రమణ స్పందించకపోవడంతో నార్మల్ కాల్ చేసి తాను చనిపోతున్నానని చెప్పి ఫోన్‌ కట్ చేసింది. వెంటనే అలర్ట్ అయిన రమణ.. తాము నివాసముండే ఇంటి ఓనర్ కు ఫోన్ చేశాడు. వారు వెళ్లేసరికి తలుపులు లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. చుట్టుపక్కల వారి సహాయంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే ఆమె చనిపోయి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. భర్త రమణను అదుపులోకి తీసుకొన్నారు.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 09 , 2024 | 08:59 AM