Share News

Bangalore: రేవ్ పార్టీలకు అడ్డా.. బెంగళూరు గడ్డ.. వారాంతాల్లో నిత్యకృత్యం

ABN , Publish Date - May 25 , 2024 | 12:42 PM

బెంగళూరు(Bangalore) అంటే ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఒకప్పుడు ఉద్యాననగరిగా, ఐటీ నగరిగా, ప్రస్తుతం స్టార్టప్‏లకు హబ్‌గా అంతర్జాతీయస్థాయిలో పేరుంది. నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. అందుకు పలు కారణాలు ఉన్నాయి.

Bangalore: రేవ్ పార్టీలకు అడ్డా.. బెంగళూరు గడ్డ.. వారాంతాల్లో నిత్యకృత్యం

- పెరుగుతున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాలు

బెంగళూరు: బెంగళూరు(Bangalore) అంటే ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఒకప్పుడు ఉద్యాననగరిగా, ఐటీ నగరిగా, ప్రస్తుతం స్టార్టప్‏లకు హబ్‌గా అంతర్జాతీయస్థాయిలో పేరుంది. నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. అందుకు పలు కారణాలు ఉన్నాయి. ఐటీబీటీతోపాటు వందలాది కార్పొరేట్‌ కంపెనీలు ఉండడం. బెంగళూరుకు శివారు ప్రాంతాలైన సర్జాపుర, బన్నేరుఘట్టరోడ్డు, కనకపుర రోడ్డు, మైసూరురోడ్డు(Mysore Road), ఎలకా్ట్రనిక్‌ సిటీ ప్రాంతాల్లో వందలకొద్దీ రిసార్టులు, ఫాంహౌస్‏లు ఉన్నాయి. ప్రశాంత జీవనానికి పేరొందిన నగరం కావడంతో దేశ విదేశీయులు ఇక్కడికి వస్తుంటారు. ఆధునిక జీవనశైలి ఇక్కడ ఏటా పెరుగుతోంది. ఆధునికత పేరిట డ్రగ్స్‌ పార్టీ వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు పెరుగుతున్నట్టు తెలుస్తోంది. కొన్ని స్టార్‌ హోటళ్లు, ఫాంహౌస్‏లు, పబ్‌లలో వారాంతమైతేచాలు పార్టీల హోరు సాగుతోంది. ఇటీవలికాలంలో నగర శివారు ఫాంహౌస్‏లలో పార్టీల సంస్కృతి పెరిగిపోతోంది. రేవ్‌పార్టీలు సాయంత్రం ప్రారంభమవుతాయి. దేశ, విదేశీ బ్రాండ్ల మద్యం, డ్రగ్స్‌, యువత హోరెత్తించే డ్యాన్స్‌లు అంతకుమించి డీజే శబ్దాలు ఉంటాయి.

ఇదికూడా చదవండి: ప్రేమ, పెళ్లి పేరుతో పలువురికి వల.. సైబర్‌ మోసగాడి అరెస్ట్‌


pandu1.2.jpg

రాత్రి పొద్దుపోయేకొద్దీ మద్యంతోపాటు డ్రగ్స్‌కూడా సమకూరుస్తుంటారు. తెల్లవారుదాకా పార్టీ కొనసాగుతుంది. నగర ప్రాంతాల్లో పార్టీలు నిర్వహిస్తే భారీ శబ్ధాలు భరించలేక వ్యతిరేకత వస్తుందనే నగర శివారు లేదా దూరప్రాంతంలోని ఓపెన్‌ ప్లేస్‌, లేదా ఫాంహౌ్‌సలలో నిర్వహిస్తారు. సాధారణంగా 50-100 మంది దాకా రేవ్‌పార్టీలో పాల్గొంటారని తెలుస్తోంది. ఒక్కోసారి ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని సమాచారం. ప్రతివారం లేదా ముందుగా నిర్ణయించుకున్న తేదీలకు అనుగుణంగా వాట్సప్‌ గ్రూప్‌లు ఏర్పాటు చేసుకుని ముందస్తుగా రిజర్వు చేసుకుంటారు. గంటలకొద్దీ పార్టీలో గడిపేందుకు మత్తు నిరంతరంగా ఉండేందుకు డ్రగ్స్‌కు అలవాటు పడతారని తెలుస్తోంది. డ్రగ్స్‌లో పాల్గొనేవారికి మెయిల్‌, వాట్స్‌ప ద్వారానే సమాచారం చేరవేస్తారు. మరోవైపు డ్రగ్‌ పెడ్లర్స్‌, నిర్వాహకులు కలసి కట్టుగానే ఏర్పాట్లు చేస్తుంటారు. డ్రగ్స్‌కు తీసుకునే వెరైటీతోపాటు మోతాదునుబట్టి వంద రూపాయల నుంచి లక్ష రూపాయల దాకా ఉంటుందని తెలుస్తోంది. గతంలో ఢిల్లీ, హైదరాబాద్‌లో ఎక్కువ సాగే రేవ్‌పార్టీలు ఇటీవల బెంగళూరువైపు మరలినట్టు తెలుస్తోంది.

ఇదికూడా చదవండి: భార్యను హత్య చేసిన భర్త.. ఘటన ఆలస్యంగా వెలుగులోకి


గత ఆదివారం ఎలకా్ట్రనిక్‌సిటీలో జరిగిన రేవ్‌పార్టీలో వందమంది పాల్గొంటే 60-70 మంది తెలుగువారే ఉన్నారు. ఇద్దరు సినిమా నటులు, వారి ఆప్తులతోపాటు కొందరు డ్యాన్సర్లు సైతం హైదరాబాద్‌ నుంచే రప్పించినట్టు తెలుస్తోంది. రేవ్‌పార్టీలో మద్యం, డ్రగ్స్‌ మాత్రమే కాకుండా వ్యభిచారం కూడా కొనసాగుతుందని తెలుస్తోంది. బెంగళూరులో ఇకపై రేవ్‌పార్టీల పట్ల నిఘా పెంచుతామని మరోసారి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరిస్తామని నగర పోలీస్‌ కమిషనర్‌ దయానంద్‌ ప్రకటించారు.

ముగ్గురిపై సస్పెన్షన్‌ వేటు

రేవ్‌పార్టీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహించారని హెబ్బగూడి పోలీస్‌ స్టేషన్‌లోని ముగ్గురిపై సస్పెన్షన్‌ వేటు వేశారు. ఈమేరకు బెంగళూరు రూరల్‌ ఎస్పీ మల్లికార్జున బాలదండి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఏఎస్‌ఐ నారాయణస్వామి, కానిస్టేబుళ్లు గిరీశ్‌, దేవరాజ్‌ను సస్పెండ్‌ చేశారు. ఏసీపీ, ఎస్‌ఐలకు మెమోలు జారీ చేశారు. రేవ్‌ పార్టీ జరుగుతున్నా ఎందుకు నిర్లక్ష్యం చేశారో వివరణ ఇవ్వాలని ఆదేశాలు పంపారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్‌ రోజున.. తగ్గిన పొల్యూషన్‌

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu Newshy

Updated Date - May 25 , 2024 | 12:42 PM