Share News

Assam: కాంగ్రెస్ నేతలు పాపులు.. హిమంత వ్యాఖ్యల కలకలం

ABN , Publish Date - Jan 14 , 2024 | 07:40 AM

లోక్ సభ ఎన్నికలకు(Parliament Elections 2024) ముందు ఇండియా కూటమి(INDIA Alliance) నేతలు ప్రజలకు వినోదాన్ని పంచుతున్నారని, కాంగ్రెస్ నేతలను పాపులుగా అభివర్ణిస్తూ అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ(Himantha Biswa Sharma) వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

Assam: కాంగ్రెస్ నేతలు పాపులు.. హిమంత వ్యాఖ్యల కలకలం

దిస్పూర్: లోక్ సభ ఎన్నికలకు(Parliament Elections 2024) ముందు ఇండియా కూటమి(INDIA Alliance) నేతలు ప్రజలకు వినోదాన్ని పంచుతున్నారని, కాంగ్రెస్ నేతలను పాపులుగా అభివర్ణిస్తూ అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ(Himantha Biswa Sharma) వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రధాని మోదీ(PM Modi)ని వ్యతిరేకించేందుకే కూటమి ఏర్పడిందని అన్నారు. "ఇండియా కూటమి ఓ సోప్ ఒపెరా. అందులో నేతలు వినోదాన్ని పంచుతుంటారు. ఉదయం ఒకరు, సాయంత్రం ఒకరు అలక చెందుతారు. మోదీని టార్గెట్ చేయడమే కూటమి పని. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టకుండా కుట్రలు చేసింది. బాబర్ వారికి అత్యంత ప్రీతిపాత్రుడు.

బాబర్ దగ్గరకు వెళ్లడం కాంగ్రెస్ కి నచ్చింది. కానీ రాముడి దగ్గరికి రావడం నచ్చలేదు. వారు పాపులు. పాపులుగానే మిగిలిపోతారు. వారిని రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానించడం తప్పు. రాముడిపై విశ్వాసం ఉన్నవారిని మాత్రమే ఆహ్వానించాలి. రాముడు, బాబర్ పక్క పక్కన ఉంటే కాంగ్రెస్ నేతలు తొలుత బాబర్ కే నమస్కరిస్తారు. అసోం సీఎం నితీష్ కుమార్ ఇండియా కూటమి కన్వీనర్ పదవిని తిరస్కరించారు. ఇలాంటి వినోదాన్ని పంచే వార్తలు ఎన్నికలు జరిగే వరకూ వస్తూనే ఉంటాయి. రాహుల్ గాంధీ(Rahul Gandhi) భారత్ జోడో న్యాయ్ యాత్ర చేస్తున్నారు. రాముడికి అన్యాయం చేసిన వ్యక్తి దేశానికి ఏం న్యాయం చేస్తారు" అని వ్యాఖ్యానించారు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే హిమంత తాజా కామెంట్స్ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

Updated Date - Jan 14 , 2024 | 07:43 AM