Share News

LokSabha Elections: మోదీకి మళ్లీ ప్రధానిగా అవకాశం ఇస్తే..

ABN , Publish Date - Apr 18 , 2024 | 08:58 PM

ప్రధానిగా నరేంద్ర మోదీకి మూడోసారి అవకాశం ఇస్తే.. ఒకటి రెండేళ్లలో దేశంలో నక్సలిజాన్ని నిర్మూలిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.

LokSabha Elections: మోదీకి మళ్లీ ప్రధానిగా అవకాశం ఇస్తే..
Amit Shah

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: ప్రధానిగా నరేంద్ర మోదీకి మూడోసారి అవకాశం ఇస్తే.. ఒకటి రెండేళ్లలో దేశంలో నక్సలిజాన్ని నిర్మూలిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. గురువారం ఓ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడారు. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో తాజాగా భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్‌లో 29 మంది నక్సలైట్లు మరణించారని తెలిపారు.

AP Elections: నారా లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరిలో వైసీపీ పరిస్థితి ఏంటో తెలుసా?

అందులో నక్సలైట్ల నాయకులు సైతం ఉన్నారని గుర్తు చేశారు. ఈ ఒక్క ఆపరేషన్‌లోనే అత్యధిక మంది నక్సలైట్లు మరణించడం.. ఛత్తీస్‌గఢ్ చరిత్రలోనే ఇదే తొలిసారి అని ఆయన వివరించారు. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత.. నక్సలైట్లను అణచివేసే కార్యక్రమం తీవ్రమైందని అమిత్ షా పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇంకా నాలుగు జిల్లాల్లో మాత్రమే నక్సల్స్ ప్రభావం ఉందన్నారు.

Shilpa Shetty: రాజ్‌కుంద్రా రూ.100 కోట్ల ఆస్తులు సీజ్


అయితే గతంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నక్సలైట్ల అణిచివేతకు కేంద్రంతో సహకరించలేదని ఆరోపించారు. కానీ ఛత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వం మారిందన్నారు. ఆ తర్వాత కేవలం 90 రోజుల్లోనే 86 మంది నక్సలైట్లు మరణిచారని చెప్పారు. అలాగే 126 మంది నక్సైలైట్లు అరెస్ట్ చేశామని... మరో 250 మంది నక్సలైట్లు ప్రభుత్వానికి లొంగిపోయారని అమిత్ షా విశదీకరించారు.

అయితే ఈ నక్సలైట్ల మరణంపై దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సుప్రియా డిమాండ్ చేశారు. దీనిపై అమిత్ షా తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మూడింట ఒక వంతు నక్సలైట్లు ఉండేవారని గుర్తు చేశారు.

Lok Sabha Elections 2024: తొలిదశ పోలింగ్‌కు సర్వం సిద్ధం: ఈసీ


కానీ ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఈ పదేళ్లలో నక్సలైట్ల ప్రభావం గల ప్రాంతాల్లో 250 సెక్యూరిటీ క్యాంపులు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఇక మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, బిహార్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నక్సలిజం పూర్తిగా పోయిందన్నారు.

జాతీయ వార్తలు కోసం..

Updated Date - Apr 18 , 2024 | 08:58 PM