Share News

Lok Sabha Elections 2024: తొలిదశ పోలింగ్‌కు సర్వం సిద్ధం: ఈసీ

ABN , Publish Date - Apr 18 , 2024 | 05:50 PM

సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ శుక్రవారం ప్రారంభం కానుంది. అందుకు కేంద్ర ఎన్నికల సంఘం స్వరం సిద్ధం చేసినట్లు ప్రకటించింది. ఈ తొలి దశ పోలింగ్‌లో 16.63 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని తెలిపింది.

Lok Sabha Elections 2024: తొలిదశ పోలింగ్‌కు సర్వం సిద్ధం: ఈసీ
Chief Election Commissioner

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ శుక్రవారం ప్రారంభం కానుంది. అందుకు కేంద్ర ఎన్నికల సంఘం స్వరం సిద్ధం చేసినట్లు ప్రకటించింది. ఈ తొలి దశ పోలింగ్‌లో 16.63 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని తెలిపింది. అందులో 8.4 కోట్ల మంది పురుషులు కాగా, 8.23 కోట్ల మంది స్త్రీలు ఉన్నారని వివరించింది. అయితే 35.67 లక్షల మంది తొలిసారి తమ ఓటు హక్కు వినియోగించనున్నారని పేర్కొంది.

AP Elections: నారా లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరిలో వైసీపీ పరిస్థితి ఏంటో తెలుసా?

ఈ దశలో మొత్తం 1.87 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు విశదీకరించింది. ఈ తొలి దశలో పోలింగ్ ప్రక్రియ కోసం 18 లక్షల మంది సిబ్బంది సేవల వినియోగించుకొంటున్నట్లు తెలిపింది. ఈ దశలో మొత్తం 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుందంది. అందులో 1,625 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు స్పష్టం చేసింది. వారిలో 1,491 మంది పురుషులు కాగా 134 మంది మహిళలు ఉన్నట్లు వివరించింది. ఇక ఈ ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం 41 హెలికాప్టర్లు, 8 ప్రత్యేక రైళ్లు, సుమారు లక్ష వాహనాలు వినియోగిస్తున్నట్లు తెలిపింది.


ఈ తొలి దశ ఎన్నికలు శాంతియుతంగా, సజావుగా నిర్వహించేందుకు షటిష్టమైన భద్రత చర్యలు చేపట్టినట్లు వివరించింది. అందుకోసం కేంద్ర బలగాలను మోహరిస్తున్నట్లు స్పష్టం చేసింది. 50 శాతం కంటే అధికంగా పోలింగ్ స్టేషన్లలో వెబ్‌కాస్టింగ్ చేయడంతోపాటు అన్ని పోలింగ్ స్టేషన్‌లలో మైక్రో అబ్జర్వర్‌లను నియామించానట్లు తెలిపింది.

Kejriwal: మామిడిపండ్లు, స్వీట్లు తింటున్నారు.. బెయిల్ కోసమే ఇలా..

ఈ దశ పోలింగ్ కోసం మొత్తం 361 పరిశీలకులను నియమించామని చెప్పింది. అలాగే 127 మంది సాధారణ పరిశీలకులు, 67 మంది పోలీసు పరిశీలకులు, 167 మంది వ్యయ పరిశీలకులను నియమించినట్లు ఈసీ ప్రకటించింది. ఇక 4,627 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 5,208 స్టాటిస్టిక్స్ సర్వైలెన్స్ టీమ్‌లు, 2,028 వీడియో సర్వైలెన్స్ టీమ్‌లు, 1,255 వీడియో వ్యూయింగ్ టీమ్‌లు ఏర్పాటు చేసినట్లు ఈసీ వివరించింది.


ఓటర్లను ప్రభావితం చేసే చర్యలను కఠినంగా నియంత్రిస్తున్నట్లు ప్రకటించింది. ఆ క్రమంలో వేగంగా స్పందించేందుకు 24 గంటలూ ఈ బృందాలు నిఘా ఉంచుతుయని తెలిపింది. 1,374 అంతర్ రాష్ట్ర, 162 అంతర్జాతీయ సరిహద్దు చెక్‌పోస్ట్‌ల వద్ద తనిఖీల కోసం ప్రత్యేక బృందాలు నియమించామని వివరించింది. మద్యం, మాదకద్రవ్యాలు, నగదు, ఉచితాల అక్రమ ప్రవాహ నివారణ కోసమే ఈ భద్రత చర్యలు చేపట్టిన ఈసీ విశదీకరించింది. అలాగే సముద్ర, వాయు మార్గాల్లోపై కూడా గట్టి నిఘా ఉంచామని తెలిపింది.

Bhadrachalam: రామయ్య పట్టాభిషేకం.. మురిసిపోయిన భక్తజనం..

85 ఏళ్ళు దాటిన 14.14 లక్షల మంది వృద్ధులు, 13.89 లక్షల మంది వికలాంగులు.. వారికి సౌకర్యం ఉన్న చోట ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల సంఘం వివరించింది. 102 లోకసభ నియోజకవర్గాల పరిధిలో అయిదువేలకుపైగా పోలింగ్ కేంద్రాల్లో పూర్తిగా మహిళా అధికారులే విధులు నిర్వహిస్తున్నారని చెప్పింది.

Komatireddy: ఎక్కడో గెలిస్తే కిక్కు ఏముంది.. భువనగిరిలో గెలిస్తేనే కిక్కు

సుమారు వెయ్యి పోలింగ్ కేంద్రాలను వికలాంగులు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ తొలి దశలో 102 లోకసభా నియోజకవర్గాలతో పాటు అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లోని 92 అసెంబ్లీ స్థానాలకు సైతం ఎన్నికలు జరగుతున్నాయంది. ఇక 102 స్థానాల్లో 73 జనరల్, 11 ఎస్టీ, 18 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయని ఎన్నికల సంఘం వివరించింది.

జాతీయ వార్తలు కోసం..

Updated Date - Apr 18 , 2024 | 05:51 PM