Share News

Ayodhya:రామ్‌లల్లాకు కుటుంబంతో వస్తా, ప్రాణ ప్రతిష్ట రోజు మాత్రం కాదు..!

ABN , Publish Date - Jan 14 , 2024 | 08:40 AM

ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌‌ను ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరుకావాలని రామజన్మభూమి ట్రస్ట్ సభ్యులు స్వయంగా ఆహ్వానించారు. ఆ రోజు హాజరుకాలేనని అఖిలేశ్ యాదవ్ స్పష్టంచేశారు.

 Ayodhya:రామ్‌లల్లాకు కుటుంబంతో వస్తా, ప్రాణ ప్రతిష్ట రోజు మాత్రం కాదు..!

అయోధ్య: అయోధ్యలో రామ్‌లల్లా ( Ayodhya Ram Mandir) ప్రాణ ప్రతిష్ట కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఇప్పటికే అయోధ్యకు (Ayodhya) భారీగా భక్తులు చేరుకుంటున్నారు. 11 వేల మంది అతిథులు హాజరు కానున్నారని తెలిసింది. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌‌ను (Akhilesh Yadav) ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరుకావాలని రామజన్మభూమి ట్రస్ట్ సభ్యులు ఆహ్వానించారు.

ట్రస్ట్ సభ్యుల ఆహ్వానాన్ని అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) సున్నితంగా తిరస్కరించారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరుకాబోమని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ స్పష్టంచేసింది. ఆ జాబితాలో అఖిలేశ్ యాదవ్ చేరారు. రాములొరి ప్రాణ ప్రతిష్ట జరిగిన తర్వాత అయోధ్యకు కుటుంబంతో వస్తానని అఖలేశ్ ప్రకటించారు. ఈ మేరకు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌కు లేఖ రాశారు. వేడుకకు రావాలని ఆహ్వానం పంపినందుకు అఖిలేశ్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. రాముడి ముసుగులో ప్రతిపక్షాలను బీజేపీ కించపరుస్తుందని అంతకుముందు అఖిలేశ్ యాదవ్ విమర్శించిన సంగతి తెలిసిందే.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 14 , 2024 | 08:40 AM