Share News

Pawars Fight: బారామతిలో నువ్వా నేనా..? సుప్రియ పై సునేత్ర పోటీ

ABN , Publish Date - Mar 31 , 2024 | 08:58 AM

బారామతి లోక్ సభ నియోజకవర్గం శరద్ పవార్ కంచుకోట. 1967 నుంచి అసెంబ్లీ, లోక్ సభలో శరద్ పవార్ గెలుస్తున్నారు. బారామతి లోక్ సభ నుంచి 2009లో శరద్ పవార్ కూతురు సుప్రియ సూలే బరిలోకి దిగారు. అప్పటి నుంచి బారామతి నియోజకవర్గంలో వరసగా విజయం సాధిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం సుప్రియకు గట్టి పోటీ ఉండనుంది. బారామతి నుంచి ఎన్సీపీ తరఫున అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ బరిలో దిగారు.

Pawars Fight: బారామతిలో నువ్వా నేనా..? సుప్రియ పై సునేత్ర పోటీ

ముంబై: బారామతి లోక్ సభ నియోజకవర్గం శరద్ పవార్ (Sharad Pawar) కంచుకోట. 1967 నుంచి అసెంబ్లీ, లోక్ సభలో శరద్ పవార్ గెలుస్తున్నారు. బారామతి లోక్ సభ (Baramati loksabha) నుంచి 2009లో శరద్ పవార్ కూతురు సుప్రియ సూలే బరిలోకి దిగారు. అప్పటి నుంచి బారామతి నియోజకవర్గంలో వరసగా విజయం సాధిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం సుప్రియకు (Supriya) గట్టి పోటీ ఉండనుంది. బారామతి నుంచి ఎన్సీపీ తరఫున అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ బరిలో దిగారు. సునేత్ర (Sunetra) వరసకు సుప్రియాకు సోదరి అవుతారు. శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ అనే సంగతి తెలిసిందే.

అక్కాచెల్లెళ్ల మధ్య పోటీ

బారామతి లోక్ సభ ఎన్నికల్లో అక్కా చెల్లెళ్ల మధ్య పోటీ ఉండనుంది. సునేత్ర పవార్ అభ్యర్థిత్వాన్ని ఎన్సీపీ శనివారం నాడు ఖరారు చేసింది. అంతకుముందే బారామతిలో సునేత్ర కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు. ఇంటింటికి తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బారామతి లోక్ సభ నుంచి ఎలాగైనా సరే గెలవాలని ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

గొప్ప రోజు

బారామతి నుంచి సునేత్ర అభ్యర్థిత్వం ఖరారు కావడంతో తెగ సంబర పడ్డారు. ‘తన జీవితంలో గొప్ప రోజుగా నిలుస్తోంది. తనకు బారామతి టికెట్ దక్కడం ఆనందంగా ఉంది. తనపై విశ్వాసం ఉంచిన ప్రధాని మోదీ, అమిత్ షా, ఏక్ నాథ్ షిండే, దేవంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌కు ధన్యవాదాలు అని ’ సునేత్ర వివరించారు. బారామతిలో సునేత్ర పోటీ కేవలం కుటుంబ కలహాలు కాదు, సిద్దాంతాలపై ఘర్షణకు ప్రతీక అని ఎన్సీపీ నేత సునీల్ పేర్కొన్నారు.

మరిన్ని లోక్ సభ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఇది కూడా చదవండి:

ED: బీజేపీలో భయం మొదలు..? సునీత కేజ్రీవాల్‌‌తో కల్పన సోరెన్ భేటీపై ఆప్

Reels: ఫ్లై ఓవర్ మీద కారు ఆపి రీల్స్.. ఆపై బ్యారికేడ్‌కు నిప్పు

Updated Date - Mar 31 , 2024 | 08:59 AM