Share News

Trains Delay: పొగమంచు ఎఫెక్ట్.. 24 రైళ్లు ఆలస్యం

ABN , Publish Date - Jan 11 , 2024 | 10:32 AM

దేశంలో చలి తీవ్రత కొనసాగుతోంది. ముఖ్యంగా ఉత్తర, మధ్య, ఈశాన్య భారతదేశంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. చలికి తోడు దట్టమైన పొగమంచు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. జనవరి 15 వరకు పొగమంచు పరిస్థితులు కొనసాగుతాయని భారత వాతావరణశాఖ తెలిపింది.

Trains Delay: పొగమంచు ఎఫెక్ట్..  24 రైళ్లు ఆలస్యం

ఢిల్లీ: దేశంలో చలి తీవ్రత కొనసాగుతోంది. ముఖ్యంగా ఉత్తర, మధ్య, ఈశాన్య భారతదేశంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. చలికి తోడు దట్టమైన పొగమంచు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. జనవరి 15 వరకు పొగమంచు పరిస్థితులు కొనసాగుతాయని భారత వాతావరణశాఖ తెలిపింది. పొగమంచు కారణంగా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చలి, పొగమంచు కారణంగా ఉదయాన్నే ఇళ్ల నుంచి బయటికి రాలేకపోతున్నారు. తెల్లవారాక కూడా పొగమంచు ఉండడంతో వాహన ప్రయాణదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పొగమంచు కారణంగా రోడ్డు కనిపంచక ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. తాజాగా పొగమంచు ప్రభావం రైల్వేపై కూడా పడింది. దట్టమైన పొగమంచు కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీకి వెళ్లే 24 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని రైల్వే శాఖ తెలిపింది.


జనవరి 11 నుంచి 15 వరకు పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపురలో దట్టమైన పొగమంచు పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇవాళ, రేపు జమ్మూ డివిజన్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తర మధ్యప్రదేశ్, ఒడిశా, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లో తీవ్ర చలివాతవరణం ఉంటుందని పేర్కొంది. వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం రాబోయే మూడు, నాలుగు రోజులు మధ్య, తూర్పు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంగా రాబోయే రెండు రోజులు తమిళనాడు, కేరళ, కోస్టల్ కర్ణాటక, లక్షద్వీప్‌లలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని, ఆ తర్వాత పొడివాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.

Updated Date - Jan 11 , 2024 | 10:32 AM