Share News

Delhi: కలుషిత ప్రాంతాల్లో తిరుగుతున్నారా.. జుట్టు రాలడంతోపాటు మరో ప్రమాదం

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:06 PM

కాలుష్య ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ఊపిరితిత్తుల సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి అనేక సమస్యలు వస్తాయి. వీటికి తోడు షుగర్ వ్యాధి వచ్చే ప్రమాదమూ ఉందని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది. ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ ప్రచురించిన అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగు చూశాయి.

Delhi: కలుషిత ప్రాంతాల్లో తిరుగుతున్నారా.. జుట్టు రాలడంతోపాటు మరో ప్రమాదం

ఢిల్లీ: కాలుష్య ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ఊపిరితిత్తుల సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి అనేక సమస్యలు వస్తాయి. వీటికి తోడు షుగర్ వ్యాధి వచ్చే ప్రమాదమూ ఉందని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది. ప్రముఖ మెడికల్ లాన్సెట్ జర్నల్(Lancet Study) ప్రచురించిన అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. కలుషిత గాలికి ఎక్కువ కాలం బహిర్గతం కావడం వల్ల జుట్టు 30 రెట్లు సన్నగా అవుతుంది.

ఇది టైప్ 2 డయాబెటిస్(Type 2 Diabetes) ప్రమాదాన్ని పెంచుతుందనేది అధ్యయన సారాంశం. 2.5 పర్టిక్యులేట్ మ్యాటర్‌తో(PM) కలుషితమైన గాలికి తిరిగితే ఈ సమస్య వస్తుందని తెలిపింది. పీఎం 2.5 కాలుష్య కారకాలకు బహిర్గతమైన వారిలో 20 శాతం టైప్ 2 మధుమేహం వచ్చే అవకాశాన్ని అధ్యయనం వివరించింది.


ఈ కాలుష్య కారకాలు చమురు, డీజిల్, బయోమాస్, గ్యాసోలిన్ దహనం నుంచి విడుదలవుతాయి. భారత్‌లో ఈ కారకాల ఉత్పత్తి విపరీతంగా పెరుగుతోంది. PM 2.5 కాలుష్య కారకాన్ని ఫ్రిక్వెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఇవి నాడీ వ్యవస్థతో పాటు, గుండెపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. దీంతోపాటు మూత్రపిండాల వ్యాధి రావడానికి కూడా కారకంగా నిలుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 537 మిలియన్ల మంది టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్నారు.

వారిలో సగం మందికి తాము డయాబెటిస్ బారిన పడినట్లు తెలియదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం.. భారత్‌లో 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న 77 మిలియన్ల మంది మధుమేహం (టైప్ 2), దాదాపు 25 మిలియన్ల మంది ప్రీడయాబెటిక్స్ (భవిష్యత్తులో మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువ)తో బాధపడుతున్నారు.


అత్యంత కాలుష్య నగరాలివే..

ప్రపంచ వాయు నాణ్యత నివేదిక ప్రకారం.. బీహార్‌లోని బెగుసరాయ్ ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన మెట్రోపాలిటన్ సిటీగా నిలిచింది. ఢిల్లీ అత్యంత పేలవమైన గాలి నాణ్యతను కలిగి ఉంది. ఇది 2018 నుంచి నాలుగు సార్లు ప్రపంచంలో అత్యంత కలుషితమైన రాజధానిగా నిలిచింది.

Delhi: సిగ్గెందుకు.. వాటి వాడకంలో మేమే టాప్.. అసద్ సంచలన వ్యాఖ్యలు

బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లు కూడా అత్యధిక కాలుష్యాన్ని కలిగి ఉన్నాయి. 2022లో క్యూబిక్ మీటరుకు సగటున 53.3 మైక్రోగ్రాముల PM2.5 సాంద్రతతో భారత్ 8వ అత్యంత కలుషిత దేశంగా నిలిచింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. భారత్‌లో 1.36 బిలియన్ల మంది PM2.5 సాంద్రత గల కాలుష్యంలో ఉంటున్నారని తెలిసింది. వీరికి ఇతర అనారోగ్య సమస్యలతో పాటు టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది.

Read Latest news and National News here..

Updated Date - Apr 29 , 2024 | 12:06 PM