Share News

India-Maldives Row: డ్రాగన్‌ చెంతకు మాల్దీవుల అధ్యక్షుడు.. సతీసమేతంగా చైనా పర్యటన

ABN , Publish Date - Jan 09 , 2024 | 12:05 PM

మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు తన భార్య సజిదా మహ్మద్‌తో కలిసి చైనా పర్యటనకు వెళ్లారు. 5 రోజుల పాటు అక్కడే ఉండి.. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం పలు అంశాలపై ఒప్పందం చేసుకుంటారు. మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ఇదివరకు ఎప్పుడూ చైనా వెళ్లలేదు.

 India-Maldives Row: డ్రాగన్‌ చెంతకు మాల్దీవుల అధ్యక్షుడు.. సతీసమేతంగా చైనా పర్యటన

అంతర్జాతీయం: భారతదేశంతో మాల్దీవులకు (Maldives) దౌత్యపరమైన వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. భారత పర్యాటకులు (Tourist) లక్ష్యద్వీప్ టూరిస్ట్ ప్లేస్‌ను డెవలప్ చేయాలని ప్రధాని మోదీ (Modi) అనడంతో వివాదం రజుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ముగ్గురు మాల్దీవుల మంత్రులు ప్రధాని మోడీపై విమర్శలు చేశారు. వారిని మంత్రివర్గం నుంచి తొలగించారు. ఆ వివాదం అలా కంటిన్యూ అవుతోంది.

ఈ క్రమంలో మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు (Mohamed Muizzu) తన భార్య సజిదా మహ్మద్‌తో కలిసి చైనా పర్యటనకు వెళ్లారు. 5 రోజుల పాటు అక్కడే ఉండి.. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం పలు అంశాలపై ఒప్పందం చేసుకుంటారు. మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ (Mohamed Muizzu) ఇదివరకు ఎప్పుడూ చైనా (China) వెళ్లలేదు. ఇది తొలి పర్యటన.. వివిధ అంశాలపై ఒప్పందాలు అని పైకి చెబుతోన్న భారత్‌తో (India) వివాదం రాజుకోవడంతో డ్రాగన్ చైనా (China) మద్దతు సాధించేందుకు వెళ్లారని స్పష్టం అవుతోంది.

మాల్దీవుల అధికారులు మాత్రం వాణిజ్యం, సామాజిక ఆర్థిక సహకారం పెంపొందించుకోవడానికి కీలక ఒప్పందాలపై ఇరు దేశాల అధినేతల మధ్య సంతకాలు జరుగుతాయని మాల్దీవుల అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 09 , 2024 | 12:07 PM