Share News

Pakistan: దాయాది దేశంలో భద్రత కరవు.. అమ్మాయిల కంటే అబ్బాయిల పైనే..

ABN , Publish Date - Mar 02 , 2024 | 11:14 AM

పొరుగుదేశం పాకిస్థాన్ (Pakistan) లో పరిస్థితులు రోజు రోజుకు మరింత దారుణంగా తయారవుతున్నాయి. దాడులు, వేధింపులు, నేరాలతో అట్టుడుకుతున్న పాక్ లో భద్రత అగమ్యగోచరంగా తయారైందని ఓ సర్వేలో వెల్లడైంది.

Pakistan: దాయాది దేశంలో భద్రత కరవు.. అమ్మాయిల కంటే అబ్బాయిల పైనే..

పొరుగుదేశం పాకిస్థాన్ (Pakistan) లో పరిస్థితులు రోజు రోజుకు మరింత దారుణంగా తయారవుతున్నాయి. దాడులు, వేధింపులు, నేరాలతో అట్టుడుకుతున్న పాక్ లో భద్రత అగమ్యగోచరంగా తయారైందని ఓ సర్వేలో వెల్లడైంది. మహిళలే కాకుండా చిన్నపిల్లలు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని తెలిపింది. ఇంటి బయటే కాకుండా ఇంటి లోపలా వారికి భద్రత కరవైందని పేర్కొంది. 2023లో పాకిస్థాన్‌లో 4,213 చిన్నారులపై అత్యాచార కేసులు నమోదయ్యాయి. అంటే సగటున రోజుకు 11 మంది చిన్నారులు దోపిడీకి గురవుతున్నారు. పిల్లల కోసం పనిచేస్తున్న సాహిల్ అనే ఎన్జీవో జాతీయ మానవ హక్కుల కమిషన్ సహకారంతో 'క్రూయెల్ నంబర్స్ 2023' పేరుతో విడుదల చేసి సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. .

లైంగిక దోపిడీ, కిడ్నాప్, తప్పిపోయిన పిల్లలు, బాల్య వివాహాలు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని నివేదికను పొందుపరిచారు. నమోదైన మొత్తం కేసుల్లో 56 శాతం మంది బాలికలు కాగా, 47 శాతం మంది బాలురు ఉన్నారు. వీరందరూ లైంగిక దోపిడీకి గురవుతున్నారు. 6 నుంచి 15 ఏళ్లలోపు అమ్మాయిల కంటే అబ్బాయిల పైనే ఎక్కువగా వేధింపులు జరుగుతున్నాయి. అంతే కాకుండా 0-5 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు సైతం లైంగిక వేధింపులు తప్పడం లేదని వెల్లడైంది.


పరిచయం ఉన్న పిల్లలపైనే లైంగిక వేధింపులు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పంజాబ్‌ ప్రావిన్స్ లోనే అత్యధిక కేసులు 75శాతం నమోదయ్యాయి. సింధ్‌లో 13 శాతం, ఇస్లామాబాద్‌లో 7 శాతం, ఖైబర్ పఖ్తుంఖ్వాలో 3 శాతం, బలూచిస్తాన్, జీబీలో 2 శాతం కేసులు నమోదయ్యాయి. లైంగిక దోపిడీ తర్వాత 61 హత్య కేసులు, 1,833 కిడ్నాప్ కేసులు, 330 పిల్లల అదృశ్యం కేసులు, 29 బాల్య వివాహాల కేసులు నమోదయ్యాయి.

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 02 , 2024 | 11:14 AM