Share News

Water Fasting: బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నారా? ఈ ట్రిక్ ఫాలో అయితే షాకింగ్ ఫలితాలుంటాయి!

ABN , Publish Date - Jan 04 , 2024 | 01:23 PM

బరువు తగ్గాలనే ప్రయత్నాలలో ఉంటే గనుక ఈ వాటర్ ఫాస్టింగ్ భలే సహాయపడుతుంది. చాలా తొందరగా మంచి ఫలితాలు ఉంటాయి.

Water Fasting: బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నారా? ఈ ట్రిక్ ఫాలో అయితే షాకింగ్ ఫలితాలుంటాయి!

అధిక బరువు సమస్య ఇప్పట్లో చాలా మందిని వేధిస్తోంది. చిన్నా పెద్ద తేడా లేకుండా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు ఉన్నారు. చాలామంది బరువు తగ్గించుకోవడానికి డైటింగ్ నుండి జిమ్, శారీరక వ్యాయమాలు కూడా ఫాలో అవుతుంటారు. అయితే బరువు తగ్గడానికి ఈ ప్రయత్నాల కంటే వాటర్ ఫాస్టింగ్ చాలా బాగా సహాయపడుతుంది. దీని వల్ల చాలా తొందరగా ఫలితాలుంటాయి. ఇంతకీ ఈ వాటర్ ఫాస్టింగ్ ఎలా పాటించాలి? దీని వల్ల కలిగే ఫలితాలేంటి? పూర్తీగా తెలుసుకుంటే..

వాటర్ ఫాస్టింగ్ ను తెలుగులో నీటి ఉపవాసం అని అంటారు. ఆహారం ఏమీ తీసుకోకుండా అప్పుడప్పుడు కేవలం నీటిని తీసుకోవడం ద్వారా బరువు తగ్గడంతో పాటు మరెన్నో లాభాలు కూడా ఉంటాయి. అడపాదడపా దీన్ని ఫాలో అయితే బరువు తగ్గడం ఇంత సులువుగా తగ్గేయచ్చా అనిపిస్తుంది.

ఇది కూడా చదవండి: జాగ్రత్త.. ఉప్పు ఎక్కువ తింటే హై బీపీనే కాదు.. ఈ నష్టాలు ఉంటాయి!


వాటర్ ఫాస్టింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు..

వాటర్ ఫాస్టింగ్ లో ఆహారాలు ఏమీ తీసుకోకపోవడం వల్ల కేలరీల శాతం సున్నగా ఉంటుంది. శరీరంలో పేరుకున్న కేలరీలు బర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

నీరు మాత్రమే తాగి ఉపవాసం ఉండటం వల్ల శరీరం కెటోసిన్ స్థితికి మారుతుంది. శరీరానికి కావలసిన శక్తి కోసం శరీరంలో నిల్వ ఉన్న కొవ్వులపై ఆధారపడుతుంది. శరీరంలో అదనపు కొవ్వులు బర్న్ చేయడానికి ఇది సహాయపడుతుంది.

ఉపవాసం ఇన్సులిన్ సెన్సిటివిటిని పెంచుతుంది. ఈ కారణంగా టైప్-2 డయాబెటిస్ ముప్పును సమర్థవంతంగా తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

రోజంతా ఉపవాసం ఉంటూ అప్పుడప్పుడు నీరు తీసుకోవడం వల్ల జీవక్రియపై సానుకూల ప్రభావం ఉంటుంది. జీవక్రియ రేటు మెరుగ్గా ఉండేందుకు ఇది సహాయపడుతుంది.

ఇది కూడా చదవండి: పరీక్షల కాలమిది.. పిల్లలలో ఒత్తిడి ఉండకూదంటే తల్లిదండ్రులు చెయ్యాల్సిన పనులివీ..!


ఉపవాసం ఆటోఫాగి అనే ప్రక్రియను ప్రేరేపిస్తుంది. ఇది శరీరంలో దెబ్బ తిన్న కణాలను తొలగించి కొత్త కణాలను పునరుత్పత్తి చేస్తుంది. ఇది మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బరువు తగ్గడానికి సహయపడుతుంది.

శరీరంలో కార్బోహైడ్రేట్లు నీటిలో నిల్వ ఉండిపోతాయి. ఉపవాసం సమయంలో కార్బోహైడ్రేట్లు తీసుకోకపోవడం వల్ల శరీరం నీటితో పాటు నిల్వ చేయబడిన గ్లైకోజెన్ ను విడుదల చేస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

ఉపవాసం చేయడం వల్ల గ్రెలిన్, లెప్టిన్ వంటి ఆకలి హార్మోన్లను, కడుపు నిండిన ఫీల్ ఇచ్చే హార్మోన్లను విడుదల చేసే స్రావాన్ని ప్రభావితం చేస్తుంది. దీని వల్ల ఆకలి నియంత్రణ సాధ్యమవుతుంది. కేలరీలు తీసుకోవడం సహజంగానే తగ్గుతుంది.

ఉపవాసం సమయంలో నీరు మాత్రమే తీసుకోవడం వల్ల కొవ్వు కణాలలో పేరుకుపోయిన టాక్సిన్స్ తొలగించడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

ఇది కూడా చదవండి: Healthy Fats: గుండె ఆరోగ్యాన్ని కాపాడే హెల్తీ ఫ్యాట్స్ ఏ ఆహారాల్లో ఉంటాయో తెలుసా? ఓసారి ఈ లిస్ట్ చూడండి..!


(గమనిక: ఇది ఆహార నిపుణులు, వైద్యులు పలుచోట్ల పేర్కొన్న అంశాల ఆధారంగా రూపొందించబడిన కథనం. ఆరోగ్యం గురించి ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించడం మంచిది.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 04 , 2024 | 01:23 PM