జాగ్రత్త.. ఉప్పు ఎక్కువ తింటే హై బీపీనే కాదు.. ఈ నష్టాలు ఉంటాయి!

ఉప్పు ఎక్కువ తింటే బీపి పెరగడం అందరికీ తెలిసిందే. కానీ బీపీ పెరిగితే గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది.

ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలు కిడ్నీ పనితీరును దెబ్బతీస్తాయి. కిడ్నీ డ్యామేజ్ కు దారితీస్తాయి.

ఎక్కువ ఉప్పు తింటే మూత్రం ద్వారా కాల్షియం నష్టానికి దారితీస్తుంది. ఇది ఎముకల బలహీనత, బోలు ఎముకల వ్యాధికి కారణమవుతుంది.

ఉప్పు ఎక్కువ తింటే మెదడు పనితీరు మందగిస్తుంది. మానసిక సమస్యలకు కారణం అవుతుంది. జ్ఞాపకశక్తి తగ్గుతుంది.

ఉప్పు ఎక్కువ తింటే శరీరంలో నీరు ఎక్కువగా నిలుస్తుంది. ఇది కడుపు ఉబ్బరం, శరీరంలో వాపులకు దారి తీస్తుంది.

ఉప్పు ఎక్కువ తింటే శరీర కణాలు బ్యాలెన్సింగ్ కోసం  నీటిని పీల్చుకుంటాయి. ఇది శరీరం డీహైడ్రేషన్ కు దారితీస్తుంది.

ఉప్పు ఎక్కువ తింటే కడుపులో ఉండే సున్నితమైన పొరలు చికాకుకు గురవుతాయి. జీర్ణాశయం దెబ్బతింటుంది