Share News

Healthy Fats: గుండె ఆరోగ్యాన్ని కాపాడే హెల్తీ ఫ్యాట్స్ ఏ ఆహారాల్లో ఉంటాయో తెలుసా? ఓసారి ఈ లిస్ట్ చూడండి..!

ABN , Publish Date - Jan 04 , 2024 | 09:45 AM

గుండె, మెదడు రెండూ బాగా పనిచేయాలంటే ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న ఆహారాలు తీసుకోవాలి. హెల్తీ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్స్ ఇవే..

Healthy Fats: గుండె ఆరోగ్యాన్ని కాపాడే హెల్తీ ఫ్యాట్స్ ఏ ఆహారాల్లో ఉంటాయో తెలుసా? ఓసారి ఈ లిస్ట్ చూడండి..!

మనిషి శరీరంలో కీలక అవయవం గుండె. నిమిషానికి 72సార్లు కొట్టుకునే గుండె ఆరోగ్యం మీదనే మనిషి వందేళ్ల ఆయుష్షు ఆధారపడి ఉంటుంది. అలాగే గుండె పనితీరు బాగున్నా మెదడు పనితీరు దెబ్బతింటే ఇక మనిషి ప్రాణముండీ ఏమీ చేయలేని స్థితిలో ఉంటాడు. అందుకే మనిషి శరీరానికి గుండె, మెదడు రెండూ చాలా ముఖ్యం. కానీ చాలామందిలో గుండె, మెదడు పనితీరు దెబ్బతినడం. జ్ఞాపకశక్తి కోల్పోవడం, మెదడు సంబంధిత, గుండె సంబంధిత జబ్బులు రావడం జరుగుతుంటుంది. ఇవి రెండూ బాగా పనిచేయాలంటే ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న ఆహారాలు తీసుకోవాలి. మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు గుండె, మెదడు ఆరోగ్యాన్ని సేఫ్ గా ఉంచుతాయి. ఈ ఆరోగ్యకరమైన కొవ్వులు ఏ ఆహారాల్లో ఉంటాయో తెలుసుకుంటే..

ఆలివ్ ఆయిల్..

ఆలివ్ నూనెలో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు, ప్రధానంగా ఒలేయిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్, యాంటీఇన్ప్లమేటరీ లక్షణాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. రెగ్యులర్ గా ఆలివ్ నూనెను తీసుకుంటే స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఇది కూడా చదవండి: ఉదయాన్నే పచ్చి కరివేపాకులు నమిలి తింటే.. ఏం జరుగుతుందంటే..!


డార్క్ చాక్లెట్..

70శాతం కోకో కంటెంట్ ఉన్న డార్క్ చాక్లెట్ లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇది మెదడుకు రక్తప్రవాహాన్ని పెంచే ఫ్లేవనాయిడ్లను కలిగి ఉంటుంది. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు మంటను తగ్గించడంలో సహాయపడతాయి.

గుడ్లు..

పోషకాలకు పవర్ హౌస్ అని గుడ్లకు పేరు. ఒమెగా-3, ఎక్కువ నాణ్యత ఉన్న ప్రోటీన్ లతో సహా ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్దిగా ఉంటాయి. మెదడు ఆరోగ్యానికి అవసరమైన కోలిన్ అనే పోషకం గుడ్లలో ఉంటుంది. రోజూ ఒక గుడ్డు తీసుకుంటే గుండె, మెదడు సేఫ్.

కొబ్బరినూనె..

కొబ్బరినూనెలో మద్యస్థ చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. ఇది సులభంగా జీర్ణమయ్యి త్వరగా శక్తిగా మారే కొవ్వు. దీని గురించి పలు సందేహాలున్నప్పటికీ బరువు తగ్గడంలోనూ, గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలోనూ కొబ్బరినూనె సహాయపడవచ్చని ఆహార నిపుణులు అంటున్నారు.

గింజలు..

బాదం, వాల్నట్స్ వంటి గింజలు. చియా, అవిసె వంటి విత్తనాలలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఒమెగా-3కు చెందిన ఆమ్లం. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, పైబర్ గుండెకు, మెదడుకు మేలు చేస్తాయి.

కొవ్వు చేపలు..

సాల్మన్, మాకేరెల్, సార్డినెస్, ట్రౌట్‌లలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. న్యూరోడెజెనరేటివ్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడం ద్వారా అరిథ్మియా ప్రమాదాన్ని తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.

ఇది కూడా చదవండి: పరీక్షల కాలమిది.. పిల్లలలో ఒత్తిడి ఉండకూదంటే తల్లిదండ్రులు చెయ్యాల్సిన పనులివీ..!


అవకాడో..

అవకాడోలలో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు, ముఖ్యంగా ఒలేయిక్ యాసిడ్‌ ఉంటాయి. ఈ కొవ్వు వాపును తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అవకాడోలో పొటాషియం ఉంటుంది ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. స్ట్రోక్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఇది కూడా చదవండి: ఓ మై గాడ్.. లవంగాల పొడిని పాలలో కలిపి తాగితే.. జరిగేదిదే..!

(గమనిక: ఇది ఆహార నిపుణులు, వైద్యులు పలుచోట్ల పేర్కొన్న అంశాల ఆధారంగా రూపొందించబడిన కథనం. ఆరోగ్యం గురించి ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించడం మంచిది.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 04 , 2024 | 09:45 AM