Share News

Weight Loss Pills: బరువు తగ్గడానికి టాబ్లెట్లు వాడుతున్నారా? బయటపడిన షాకింగ్ నిజాలు తెలిస్తే..!

ABN , Publish Date - May 31 , 2024 | 07:33 PM

ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బరువు తగ్గడం ఆందోళనకరంగా మారింది. కొంతమంది ఆరోగ్యకరమైన ఆహారం, సాధారణ ఫిట్‌నెస్ ఫాలో కావడం, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లను అనుసరించడం ద్వారా సహజ మార్గాన్ని ఎంచుకుంటే..

Weight Loss Pills: బరువు తగ్గడానికి  టాబ్లెట్లు వాడుతున్నారా? బయటపడిన షాకింగ్ నిజాలు తెలిస్తే..!

ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బరువు తగ్గడం ఆందోళనకరంగా మారింది. కొంతమంది ఆరోగ్యకరమైన ఆహారం, సాధారణ ఫిట్‌నెస్ ఫాలో కావడం, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లను అనుసరించడం ద్వారా సహజ మార్గాన్ని ఎంచుకుంటే.. మరికొందరు బరువు తగ్గడానికి బరువు తగ్గించే మందులను ఆశ్రయిస్తారు. ఈ మందులు వైద్యులు సిఫార్సు చేసినప్పటికీ, బరువు తగ్గించే మందులు సురక్షితమేనా? అనే ప్రశ్న చాలా పెద్ద చర్చకు దారి తీస్తోంది. ముఖ్యంగా ఈ బరువు తగ్గించే మాత్రల గురించి చేసిన పరిశోధనలలో బయటపడిన నిజాలు చాలా షాకింగ్‌గా ఉన్నాయి. ఈ మాత్రల వాడతం వల్ల కడుపు పక్షవాతం ఏర్పడవచ్చునని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

బరువు తగ్గించే మాత్రల గురించి జరిగిలన పరిశోధనలలో గ్యాస్ట్రో పెరేసిస్ అభివృద్ది చెందే ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి. గ్యాస్ట్రో పరేసిస్ అనేది కడుపు పక్షవాతం. ఇది కడుపు నరాలు, కండరాలను ప్రభావితం చేస్తుంది.

Weight-Loss-Pills-Health-Pr.jpg

బరువు తగ్గడానికి మాత్రలు తీసుకునే వారిలో 66శాతం మంది గ్యాస్ట్రో పరేసిస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ మందులు తీసుకుంటున్న వారిలో ఆహారం తీసుకున్న నాలుగు గంటల తరువాత కూడా జీర్ణాశయంలో ఆహారం ఉండటాన్ని పరిశోధకులు పరిశోధనలలో కనుగొన్నారు. ఇదే గ్యాస్ట్రో పరేసిస్ ను సూచిస్తుంది. గ్యాస్ట్రో పరేసిస్ సమస్య ఉన్నవారిలో 18 నెలల తరువాత ఈ ప్రమాదం 25 శాతం పెరిగినట్టు పరిశోధనలలో వెల్లడైంది.

బరువు తగ్గడానికి బరువు తగ్గించే మాత్రలు ఎప్పటికీ పరిష్కారం కాదని. ఇందుకోసం జీవనశైలి లో మార్పులు, వ్యాయామం, ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Updated Date - May 31 , 2024 | 07:33 PM