Share News

Peanuts: వేరుశెనగలు అతిగా తింటున్నారా? అయితే ముందు ఇవి తెలుసుకోండి..

ABN , Publish Date - Mar 18 , 2024 | 05:55 PM

Peanuts Side Effects: వేరుశెనగల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఇంటి వంట గదిలో వేరుశెనగలు తప్పనిసరిగా ఉంటాయి. చాలా మంది ప్రజలు తమ వంటకాల్లో పల్లీలను/వేరుశెనగలను(Peanuts) వినియోగిస్తారు. కాల్చి, ఉడకబెట్టి, బట్టర్‌గా, నూనెగా రకరకాలుగా వేరుశెనగలను వినియోగిస్తారు. పల్లీలను స్నాక్స్‌గా బాగా తింటుంటారు. పల్లీలలో పోషకాలు(Proteins) చాలా ఉంటాయి. వీటిని తినడం వలన ఆరోగ్యానికి(Health) కూడా ఎంతో మేలు జరుగుతుంది.

Peanuts: వేరుశెనగలు అతిగా తింటున్నారా? అయితే ముందు ఇవి తెలుసుకోండి..
Peanuts Side Effects

Peanuts Side Effects: వేరుశెనగల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఇంటి వంట గదిలో వేరుశెనగలు తప్పనిసరిగా ఉంటాయి. చాలా మంది ప్రజలు తమ వంటకాల్లో పల్లీలను/వేరుశెనగలను(Peanuts) వినియోగిస్తారు. కాల్చి, ఉడకబెట్టి, బట్టర్‌గా, నూనెగా రకరకాలుగా వేరుశెనగలను వినియోగిస్తారు. పల్లీలను స్నాక్స్‌గా బాగా తింటుంటారు. పల్లీలలో పోషకాలు(Proteins) చాలా ఉంటాయి. వీటిని తినడం వలన ఆరోగ్యానికి(Health) కూడా ఎంతో మేలు జరుగుతుంది. అందుకే.. పిల్లలు మొదలు పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా పల్లీలను తింటారు. అయితే, పల్లీలు తినడం వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అదే మాదిరిగా దుష్పరిణామాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవును, వేరుశెనగలను అతిగా తినడం వలన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. మరి అతిగా పల్లీలు తినడం వలన కలిగే నష్టాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..

అలర్జీ..

వేరుశెనగలు అతిగా తినడం వలన అలెర్జీ సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. శరీరంపై దురద, దద్దుర్లు, వాపు, శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయిన ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తీవ్రమైన సందర్భాల్లో అనాఫిలాక్సిస్‌ వస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా కొందరు వ్యక్తుల్లో తేలికపాటి అనారోగ్య సమస్యలు మొదలు.. ప్రాణాంతక అత్యవసర పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేరుశెనగలు పడని వారు వాటిని తీసుకోకపోవడమే ఉత్తమం అని సూచిస్తున్నారు.

దద్దుర్లు/వాపు..

వేరుశెనగల్లో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో మంటను ప్రేరేపిస్తుంది. ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్-2016 జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. ఈ కొవ్వులు శరీరానికి చాలా అవసరం. అయితే, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలతో అసమతుల్యత వాపునకు కారణం అవుతుంది. వేరుశెనగలో లెక్టిన్‌లు, అఫ్లాటాక్సిన్‌లు ఉంటాయి. ఇవి సున్నితమైన వ్యక్తులలో తాపజనక ప్రతిస్పందనలను తీవ్రతరం చేసే సమ్మేళనాలు. అందుకే.. పడని వారు వీటిని తినకపోవడమే ఉత్తమం.

కడుపు ఉబ్బరం..

2019లో గ్యాస్ట్రోఎంటరాల్ హెపాటోల్ అనే జర్నల్‌లో ప్రచురించిన కథనం ప్రకారం.. వేరుశెనగను అధికంగా తినడం వలన కడుపు ఉబ్బరం సమస్య తలెత్తుతుంది. వేరుశెనగలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అయితే, దీనిని అధికంగా తీసుకుంటే కడుపు ఉబ్బరంగాతో సహా జీర్ణ వ్యవస్థ అసౌకర్యానికి కారణం అవుతుంది. వేరుశెనగలో కొన్ని కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కొంతమంది వ్యక్తుల్లో ఇవి జీర్ణం కావడం కష్టంగా ఉంటుంది. తద్వారా గ్యాస్, కడుపు ఉబ్బరం కలుగుతుంది. అందుకే మితంగా తినడం ఉత్తమం.

అతిసారం..

2016లో జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. వేరుశెనగలో అధిక స్థాయిలో కొవ్వు, ఫైబర్ ఉంటుంది. వీటిని అధిక మొత్తంలో తీసుకుంటే.. జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా అతిసారం సమస్య తలెత్తవచ్చు. అందుకే.. జీర్ణ వ్యవస్థ సరిగా ఉండాలంటే వేరుశెనగలను మితంగా తినాలని సూచిస్తున్నారు.

బూజుపట్టిన వేరుశెనగలు..

తేమతో కూడిన వాతావరణం కారణంగా వేరుశెనగలు కొన్నిసార్లు బూజు పడుతాయి. ఎక్కువ కాలం నిల్వ చేయడం వలన కూడా వేరుశెనగలో బూజు పడుతుంది. వాటిని గమనించకుండా తింటే.. ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. శ్వాసకోస సమస్యలను ప్రేరేపిస్తుంది. అంతేకాదు.. వికారం, వాంతులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వేరు శెనగలను తినేటప్పుడు బూజు పట్టిన, పాడైపోయిన వాటిని పడేయడం ఉత్తమం.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 18 , 2024 | 05:55 PM