Share News

Lemon juice: నిమ్మరసంతో లాభాలే కాదు.. నష్టాలూ ఉంటాయ్.. నిమ్మరసం ఎక్కువ తీసుకుంటే ఏం జరుగుతుందంటే..!

ABN , Publish Date - May 16 , 2024 | 04:21 PM

బయటకు వెళ్లి బాగా అలసిపోయి ఇంటికి చేరగానే నిమ్మరసం నీళ్లు తాగితే అదొక గొప్ప రిలాక్సేషన్. ఇక వేసవి కాలంలో అయితే నిమ్మరసానికి,నిమ్మకాయలకు చాలా డిమాండ్ ఉంటుంది. నిమ్మరసంలో విటమిన్-సి పుష్కలంగా ఉండటం వల్ల ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని

Lemon juice: నిమ్మరసంతో లాభాలే కాదు.. నష్టాలూ ఉంటాయ్.. నిమ్మరసం ఎక్కువ తీసుకుంటే ఏం జరుగుతుందంటే..!

నిమ్మరసం ఆరోగ్యానికి చాలామంచిది. ఇంటికి అతిథులు వస్తే చాలామందికి మొదటగా గుర్తొచ్చేది నిమ్మకాయ షర్బతే.. బయటకు వెళ్లి బాగా అలసిపోయి ఇంటికి చేరగానే నిమ్మరసం నీళ్లు తాగితే అదొక గొప్ప రిలాక్సేషన్. ఇక వేసవి కాలంలో అయితే నిమ్మరసానికి,నిమ్మకాయలకు చాలా డిమాండ్ ఉంటుంది. నిమ్మరసంలో విటమిన్-సి పుష్కలంగా ఉండటం వల్ల ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని నిమ్మరసాన్ని ఎక్కువగా తీసుకుంటే మాత్రం నష్టాలు తప్పవని ఆహార నిపుణులు, వైద్యులు చెబుతున్నారు. ఇంతకీ నిమ్మరసం ఎక్కువ తీసుకుంటే ఏం జరుగుతుందంటే..

నిమ్మరసంలో ఉండే యాసిడ్లు నోటిని, నోటి లోపలి చర్మాన్ని చాలా సున్నితంగా మార్చేస్తాయి. ఎప్పుడో ఒకసారి అయినా లేకపోతే రోజులో ఒక నియమిత పరిమాణంలో అయినా తీసుకుంటే పర్లేదు. కానీ మరీ ఎక్కువగా తీసుకుంటే మాత్రం నోటి పుండ్లు, చిన్నపాటి గాయాలు, చికాకులు ఏర్పడతాయి.

ఆహారంలో బెల్లం చేర్చుకోవాలని చెప్పే 10 బలమైన కారణాల లిస్ట్ ఇదీ..!


నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఎక్కువగా నోటి ద్వారా వెళితే నోటి పూతలు చాలా సులువుగా అవుతాయి. అంతేకాదు నిమ్మరసంలోని సిట్రస్ గుణాలు గుండెల్లో మంటకు కారణం అవుతాయి.

నిమ్మరసంలో ఉండే సమ్మేళనాలు దంతాల ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తాయి. దంతాల మీద ఎనామిల్ ను దెబ్బతీసి దంతాలు సెన్సిటివ్ గా మారేలా చేస్తాయి. అంతేకాదు దంతాల ఎముకలు, చిగుర్లను బలహీన పరుస్తాయి.

సాధారణంగా శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు నిమ్మరసం కలిపిన నీరు తాగుతుంటారు. ఇది శరీరాన్ని తిరిగి హైడ్రేట్ చేస్తుందని అనుకుంటారు. అయితే నిమ్మరసాన్ని ఎక్కువగా తీసుకుంటే అది శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది.

అలసట, తలనొప్పి, వికారం వంటి సమస్యలున్నప్పుడు నిమ్మరసాన్ని తీసుకుంటూ ఉంటారు. కానీ మైగ్రేషన్ సమస్యతో బాధపడేవారు నిమ్మరసాన్ని తీసుకోకూడదు. అప్పటికే మైగ్రేషన్ ఉన్నవారు నిమ్మరసం తీసుకుంటే సమస్య మరితం ఎక్కువ అవుతుంది.

మీకూ నాలుక తెల్లగా ఉంటుందా? దీనికి అసలు కారణాలు ఇవే..!

ఆహారంలో బెల్లం చేర్చుకోవాలని చెప్పే 10 బలమైన కారణాల లిస్ట్ ఇదీ..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 16 , 2024 | 04:21 PM