మీకూ నాలుక తెల్లగా ఉంటుందా? దీనికి అసలు కారణాలు ఇవే..!

కొంతమందికి నాలుక తెల్లగా ఉంటుంది. ఇలాంటి నాలుక ఉన్న కొందరిలో నోటి దుర్వాసన కూడా ఉంటుంది. రుచిని సరిగా గ్రహించలేకపోవడం, నోటి పూత వంటి సమస్యలు వీరిలో ఎక్కువగా ఉంటాయి. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి.

ధూమపానం ఎక్కువగా చేయడం వల్ల నాలుక మీద సన్నని తెల్లని పొర ఏర్పడుతుంది.  ఇది నాలుక మీద మృత కణాల సంఖ్యను పెంచుతుంది.

నోరు సరిగా శుభ్రం చేసుకోకపోతే నాలుక మీద తెల్లగా పొర పేరుకుపోతుంది.

నాలుకలో బ్యాక్టీరియా, ఈస్ట్ అధికంగా పెరగడం వల్ల పాపిల్లా లేదా గడ్డలు, వాపు, రంగు మారడం వంటి సమస్యలు వస్తాయి.

శరీరం డీహైడ్రేషన్ కు గురైనప్పుడు కూడా నాలుక తెల్లగా మారుతుంది.

ల్యూకోప్లాకియా అనే సమస్య ఉన్నప్పుడు కూడా నాలుక తెల్లగా ఉంటుంది.  దీంటో నాలుక నోటిపై బూడిద లేదా తెలుపు రంగు ప్యాచెస్ ఉంటాయి.

ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉన్నవారిలో కూడా నాలుక తెల్లగా ఉంటుంది.

నోరు పొడిబారడం వల్ల తెల్లనాలుక ఏర్పడితే అది  కాన్డిడియాసిస్ వంటి ఇన్ఫెక్షన్లు పెరుగడానికి కారణం  అవుతుంది.