ఆహారంలో బెల్లం చేర్చుకోవాలని చెప్పే 10 బలమైన కారణాల లిస్ట్ ఇదీ..!

అనీమియాతో బాధపడేవారు బెల్లాన్ని తీసుకుంటే ఐరన్ లోపం భర్తీ అవుతుంది.

బెల్లంలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో వివిధ రకాల ఫ్రీ రాడికల్స్ తో పోరాడటంలో సహాయపడతాయి.

బెల్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అజీర్ణం, మలబద్దకం, అపానవాయువు వంటి జీర్ణ రుగ్మతలను నివారిస్తుంది.

శరీరంలో టాక్సిన్లను బయటకు పంపి శరీరాన్ని శుద్ది చేయడంలో బెల్లం సహాయపడుతుంది.

బెల్లం నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తుంది. ఇది రోజంతా చురుగ్గా, శక్తివంతంగా ఉంచుతుంది.

బెల్లంలో ఐరన్, ఫోలేట్ ఉంటాయి. ఇవి రక్తప్రసరణ సక్రమంగా నిర్వహించడానికి, నెలసరి నొప్పులు, తిమ్మిర్లు తగ్గించడంలోనూ సహాయపడతాయి.

బెల్లంలో ఉండే ఖనిజాలు, విటమిన్లు రోగనిరోధక శక్తని పెంచడంలోనూ, సీజనల్ సమస్యలను ఎదుర్కోవడంలోనూ సహాయపడతాయి.

ఉబ్బసం, బ్రోన్కైటిస్,  అలెర్జీలు వంటి శ్వాస సమస్యలు నివారించడంలో బెల్లం బాగా సహాయపడుతుంది.

యాంటీ అలెర్జీ లక్షణాలున్న కారణంగా బెల్లాన్ని తీసుకుంటే శ్వాస సంబంధ సమస్యలు  నివారించబడతాయి.