Share News

Kids Health: ఈ నాలుగు ఆహారాలను పిల్లలకు ఇస్తుంటే చాలు.. పిల్లలలో రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది..!

ABN , Publish Date - May 16 , 2024 | 02:10 PM

పెద్దవాళ్లు అయితే ఇష్టం లేకపోయినా ఆరోగ్యం కోసం, రోగనిరోధక శక్తి కోసం కొన్ని రకాల ఆహారాలను బలవంతంగా అయినా తీసుకుంటూ ఉంటారు. కానీ చిన్న పిల్లలు తమకు నచ్చని ఆహారాన్ని తినడానికి అస్సలు ఇష్టపడరు. ఈ కారణంగా పిల్లలలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది.

Kids Health: ఈ నాలుగు ఆహారాలను పిల్లలకు ఇస్తుంటే చాలు.. పిల్లలలో రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది..!

రోగనిరోధక శక్తి అనే విషయం గురించి తరచుగా చర్చ జరుగుతూనే ఉంటుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే పెద్దలు అయినా పిల్లలు అయినా చాలా తొందరగా జబ్బుల బారిన పడతారు. అదే విధంగా జబ్బుల నుండి తిరిగి కోలుకోవడం కూడా కష్టం. పెద్దవాళ్లు అయితే ఇష్టం లేకపోయినా ఆరోగ్యం కోసం, రోగనిరోధక శక్తి కోసం కొన్ని రకాల ఆహారాలను బలవంతంగా అయినా తీసుకుంటూ ఉంటారు. కానీ చిన్న పిల్లలు తమకు నచ్చని ఆహారాన్ని తినడానికి అస్సలు ఇష్టపడరు. ఈ కారణంగా పిల్లలలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అయితే ఈ కింది నాలుగు ఆహారాలను పిల్లలకు తినిపిస్తూ ఉంటే చాలు.. రోగనిరోధక శక్తి పుష్కలంగా పిల్లలకు అందుతుంది.

పెరుగు..

పెరుగులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా మాత్రమే కాకుండా ప్రోటీన్, కాల్షియం, లాక్టోస్, ఐరన్, ఫాస్పరస్ ఉంటాయి. ఇవన్నీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి పని చేస్తాయి. పిల్లలు ప్రతిరోజూ పెరుగు తినేలా చేస్తే మంచి రోగనిరోధక శక్తిని పొందుతారు.

ఆహారంలో బెల్లం చేర్చుకోవాలని చెప్పే 10 బలమైన కారణాల లిస్ట్ ఇదీ..!


తేనె..

పిల్లల రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి తేనెను ఆహారంల భాగం చేయవచ్చు. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పచ్చి తేనెలో పుష్కలంగా ఉంటాయి. ఇది పిల్లల రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.

సిట్రస్ పండ్లు..

సిట్రస్ పండ్లలో మంచి మొత్తంలో విటమిన్ సి లభిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. పిల్లలకు సీజనల్ పండ్లైన నిమ్మ, నారింజ, కివీ వంటి పండ్లను తినిపించవచ్చు.

గుడ్లు..

పిల్లలలో రోగనిరోధక శక్తి బలంగా ఉండాలండే రోజుకు ఒక గుడ్డు తినేలా చేయడం మంచిది. ఇందులో విటమిన్లు, ఒమేగా 3, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల పిల్లలలో రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది.

బెకింగ్ కోసం మైదాకు బదులుగా వాడుకోదగిన 7 రకాల పిండులు ఇవీ..!

ఆహారంలో బెల్లం చేర్చుకోవాలని చెప్పే 10 బలమైన కారణాల లిస్ట్ ఇదీ..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 16 , 2024 | 02:10 PM