బెకింగ్ కోసం మైదాకు బదులుగా వాడుకోదగిన 7 రకాల పిండులు ఇవీ..!

సంపూర్ణ గోధుమ పిండిని  హోల్ వీట్ ఫ్లోర్ అని కూడా అంటారు.  ఇది బేకింగ్ ఆహారాలకు ఫైబర్ ను జోడిస్తుంది.

ఓట్స్ ను పిండిగా చేసి దీన్ని బేకింగ్ ఆహారాలలో మైదాకు బదులుగా వాడచ్చు.

బాదం పప్పుల నుండి తయారైన బాదం పిండి  గ్లూటెన్ రహితమైనది, అలాగే  కిటో ఫ్రెండ్లీ గా ఉంటుంది. మైదాకు మంచి ప్రత్యామ్నాయం.

మెత్తగా తయారైన కొబ్బరి పొడిని కూడా మైదాకు బదులుగా వాడచ్చు. ఫైబర్ కంటెంట్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఇందులో ఉంటాయి. ఇది గ్లూటెన్ ఫ్రీ ఆహారం.

స్పెల్లింగ్ బెర్రీస్ నుండి లభించే పిండిని స్పెల్డ్ ఫ్లోర్ అంటారు. ఇవి పురాతన కాలానికి చెందిన గోధుమలు.  ఈ పిండిలో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.

శనగపిండిలో ప్రోటీన్, ఫైబర్ ఉంటుంది.  ఇది గ్లూటెన్-ఫ్రీ కూడా. మైదాకు బదులుగా బేకింగ్ కోసం దీన్ని వాడచ్చు.

సంపూర్ణ గోధుమ పిండిని బాదం పిండి లేదా వోట్ పిండితో కలపడం వల్ల బేకింగ్ ఆహారాలకు మెరుగైన రుచిని తీసుకురావచ్చు.