టీ తాగేందుకు ఫాలోకావాల్సిన ఆరు రూల్స్ ..!

ఆరోగ్యకరమైన సమస్యల ఉన్నట్లయితే టీని ఎక్కువగా తీసుకోవద్దని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి.

భారతదేశంలో అత్యంత ఇష్టమైన పానీయం టీ. చాలామంది ఉదయాన్నే టీ తాగేందుకు ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. రోజులో రెండు మూడుసార్లు తాగుతుంటారు.

అయితే చాలా అధ్యయనాలు టీని మితంగా తీసుకోమని చెబుతున్నాయి.. అది ఎందుకంటే..

ప్రతి ఒక్కరూ టీ తాగేందుకు కొన్ని నియమాలను పెట్టుకోవాలి. 

నిద్రకు ముందు టీ తీసుకోకూండా ఉండాలి. లేదంటే నిద్ర పాడయ్యే అవకాశాలున్నాయి.

ఖాళీ కడుపుతో స్ట్రాంగ్ టీకి కూడా దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

టీలో 30 నుంచి 65 MG కెఫీన్ ఉంటుంది. 

భోజనానికి ముందు తర్వాత కనీసం ఒక గంట టీకి దూరంగా ఉండాలి.

టీలో టానిన్లు ఉంటాయి. ఇది శరీరంలో ఇనుము శోషణను తగ్గిస్తుంది.

పాలు లేకుండా టీ తాగడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుటం వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయని ICMR తెలిపింది.