ఈ అలవాట్లు ఉన్నవారు మేధావులు అవుతారట..!

పనిని స్మార్ట్ గా చేసేవారి మెదడు చురుగ్గా ఉంటుంది. ఇలాంటి వారు మేధావులు అయ్యే అవకాశం మెండు.

 మంచి శ్రోతగా ఉండటం ఎవరేం చెప్పినా వినడం మేధావుల లక్షణం. ఎదుటివారు చెప్పినదాంట్లో మంచిని గ్రహించడం వీరిని మేధావులుగా మారుస్తుంది.

ఏదైనా ఒక పనిని మొదలుపెట్టేముందు ఆలోచించి ప్రణాళికలు వేసుకోవడం మేధావుల లక్షణం.

ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం నేర్చుకుంటే జీవితం స్మార్ట్ గా ఉంటుంది.

తెలివైన వ్యక్తులు ఇతరుల అభిప్రాయాలు తమ మీద ఉండటానికి ఇష్టపడరు. సొంత నిర్ణయాలు తీసుకోవడంలో అందులో సక్సెస్ కావడంలో వీరెప్పుడు మెరుగ్గా ఉంటారు.

మేధావులు పెద్ద లక్ష్యాలను ముందుంచుకుని శ్రమ పడరు. పెద్ద లక్ష్యాలను కూడా చిన్న లక్ష్యాలుగా విభజించుకొని వాటిని సులువుగా పూర్తీ చేస్తారు.

మనసులో ఉన్న ప్రశ్నలకు ఎప్పటికప్పుడు సమాధానాలు తెలుసుకుంటూ ఉండేవారిలో ఆలోచనా సామర్థ్యం ఎక్కువ ఉంటుంది. వీరు మేధావులు అవుతారు.

సమయం ప్రాముఖ్యతను అర్థం చేసుకుని తెలివిగా సమయాన్ని సద్వినియోగం చేసుకునేవారు మేధావులు అవుతారు.