ఫారిన్ లొకేషన్స్‌ని తలపించే అందమైన టూరిస్ట్ ప్రాంతాలు

అండమాన్ & నికోబార్ దీవులు: థాయ్‌లాండ్‌లోని ఫై ఫై దీవులకు ఇవి సమానం. సహజమైన బీచ్‌లు, సముద్ర జీవులతో భూతలస్వర్గంలా అనిపిస్తుంది.

థార్ ఎడారి: నార్త్ ఆఫ్రికాలోని సహారా ఎడారికి ఇది ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయంగా అనిపిస్తుంది. ఇక్కడ కూడా ఎన్నో భూభాగాలను అన్వేషించొచ్చు.

కశ్మీర్: స్విట్జర్లాండ్ తరహాలోనే పైన్ చెట్లు, మంచుతో కప్పబడిన పర్వతాలు, సరస్సులతో అలంకరించబడిన ప్రకృతి దృశ్యాలకు ఈ కశ్మీర్ నిలయం.

కూర్గ్: దీనిని స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఈ కూర్గ్‌లో స్కాట్లాండ్‌ను తలపించే అంతులేని ప్రకృతి దృశ్యాలు చూపరుల్ని ఆకర్షిస్తాయి.

అలెప్పీ: దక్షిణాదిలోనే ఓ అద్భుత టూరిస్ట్ ప్రాంతం. తూర్పి వెనిస్‌గా పేరుగాంచిన అలెప్పీలో మంత్రముగ్ధుల్ని చేసే ఎన్నో సహజమైన అందాలున్నాయి.

చిత్రకూట్ జలపాతం: భారత నయాగారా ఫాల్స్‌గా ఇది పేరుగాంచింది. ఒక్కసారి ఇక్కడికి విచ్చేస్తే.. ఆ అనుభవాన్ని ఇక జీవితాంతం మర్చిపోలేరు.

లక్షద్వీప్: మాల్దీవుల తరహాలోనే ఇక్కడ సుస్పష్టమైన జలాలు, రిచ్ మెరిన్ లైఫ్, ఆకర్షణీయమైన ప్రకృతి అందాలతో ఈ ప్రాంతం ఆకర్షిస్తుంది.

పుదుచ్చేరి: ఇది ఫ్రాన్స్‌ను గుర్తుకు తెస్తుంది. అందమైన తీరప్రాంతంలో ఫ్రెంచ్ వాస్తుశిల్పంతో సాంప్రదాయ భారతీయ సంస్కృతి మిళతమై ఉంటుంది.