Share News

Eye Sight: ఈ 5 ఆహారాలు ట్రై చేశారంటే కళ్లజోడు అవసరమే ఉండదు.. డేగలాంటి చూపు ఖాయం!

ABN , Publish Date - Jan 08 , 2024 | 09:34 AM

ఈ 5 సూపర్ ఫుడ్స్ తింటే చాలు.. డేగ లాంటి చూపు సొంతమవుతుంది. కళ్లజోడు వాడాల్సిన అవసరం అస్సలు ఉండదు.

Eye Sight: ఈ 5 ఆహారాలు ట్రై చేశారంటే  కళ్లజోడు అవసరమే ఉండదు.. డేగలాంటి చూపు ఖాయం!

ఆహారం తీసుకునేటప్పుడు ఎముక బలానికి ఏం తినాలి? బరువు పెరగకూడదంటే ఏం తినాలి? గుండె ఆరోగ్యంగా ఉండటానికి ఏం తినాలి? అందంగా కనిపించడానికి ఏం తినాలి? అని తెగ వెతుకుతూ ఉంటారు. వీటికి తగ్గట్టే ఆహారాలు ఎంపిక చేసుకుని తింటుంటారు. కానీ దృష్టి మందగించినా.. కళ్లజోడు వాడే అవసరం వచ్చినా అదేమంత పెద్ద సమస్య కాదులే అన్నట్టు దాని గురించి పట్టించుకోరు చాలామంది. అయితే కళ్లజోడు వాడుతున్నా, దృష్టి విషయంలో ఇబ్బందులున్నా, భవిష్యత్తులో అస్సలు దృష్టి సమస్యలు రాకూడదన్నా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారాలు తీసుకోవాలి. ఈ సూపర్ ఫుడ్స్ కంటి ఆరోగ్యానికి పదును పెడతాయి(Super Foods For Eye Sight). డేగ లాంటి తీక్షణమైన చూపును ప్రసాదిస్తాయి.

క్యారెట్..(Carrot)

క్యారెట్‌లలో బీటా-కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. కంటి రెటీనా, కంటిలోని ఇతర భాగాలు సజావుగా పనిచేయడానికి విటమిన్ ఎ అవసరం. బీటా-కెరోటిన్ విటమిన్-ఎ ఉత్పత్తికి సహాయపడుతుంది. బీటా-కెరోటిన్ లో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కంట్లో మచ్చలు, కంటిశుక్లం వంటి సమస్యల నుండి కూడా రక్షిస్తాయి.

ఇది కూడా చదవండి: అల్పాహారంగా మొలకలు తింటే కలిగే షాకింగ్ ఫలితాలివీ..!


పాలకూర..(Spinach)

బచ్చలికూర లుటీన్, జియాక్సంతిన్‌ అనే ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్లు సహా అనేక పోషకాలకు పవర్‌హౌస్. ఈ పోషకాలు సహజంగా కంటికి సన్ గ్లాసెస్ లాగా పనిచేస్తాయి, హానికరమైన కా ఫిల్టర్ చేస్తాయి మరియు కళ్ళు దెబ్బతినకుండా కాంతి కిరణాలు, తరంగధైర్ఘ్యాల నుండి కళ్ళను కాపాడతాయి.

ఫ్యాటీ ఫిష్..(Fatty Fish)

ఫ్యాటీ ఫిష్ ను కొవ్వు చేపలు అని కూడా అంటారు. వీటిలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సాల్మన్, ట్యూనా, మాకేరెల్ చేపలలో ఒమెగా-3 పుష్కలంగా ఉంటుంది. రెటీనా కణాల నిర్మాణానికి, పొడి కళ్లకు ఇది మంచిది.

ఇది కూడా చదవండి: ఏలకుల పాలకు ఇంత శక్తి ఉందా? రాత్రి పడుకునేముందు తాగితే జరిగేదిదీ..!


గింజలు, విత్తనాలు..(nuts & seeds)

బాదం, అవిసె గింజలు, పొద్దు తిరుగుడు విత్తనాలలో విటమిన్-ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది గొప్ప యాంటీ ఆక్సిడెంట్. ఫ్రీ రాడికల్స్ నుండి కళ్ళలోని కణాలను రక్షిస్తుంది. వీటికి క్రమం తప్పకుండా తీసుకుంటే వయసు వచ్చే కంటి సమస్యలు కూడా క్రమంగా తగ్గుతాయి.

సిట్రస్ పండ్లు..(Citrus Fruits)

నారింజ, నిమ్మ, బత్తాయి వంటి ఇతర సిట్రస్ పండ్లలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్-సి ఆరోగ్యాన్నే కాకుండా కళ్లను, కంటి కణజాలలాను బాగు చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కంటి శుక్లం, మాక్యులార్ డీజెనరేషన్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఇది కూడా చదవండి: Women: ఆడవాళ్లు వేసుకునే గాజుల వెనుక ఇన్ని రహస్యాలున్నాయా? వైద్యులు చెబుతున్న నిజాలివీ..!


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 08 , 2024 | 09:34 AM