ఏలకుల పాలకు ఇంత శక్తి ఉందా? రాత్రి పడుకునేముందు తాగితే జరిగేదిదీ..!

ఏలకులు కలిపిన పాలు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది.

మౌత్ అల్సర్లు, కడుపులో అల్సర్లు నయం చేయడంలో ప్రభావవంతంగా ఉంటుంది.

పడుకునే ముందు ఏలకుల పాలు తాగితే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

జలుబు, దగ్గు సమస్యతో ఇబ్బంది పడుతుంటే ఏలకుల పాలు మంచి ఔషదంగా పనిచేస్తాయి. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.

రెండింటిలోనూ కాల్షియం ఉండటం వల్ల ఎముకలను బలోపేతం చేస్తాయి.

యాలకులలో ఉండే రసాయనాలు పాలతో కలిస్తే మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయి. మానసిక ఒత్తిడి, అలసట దూరం చేస్తాయి.

ఏలకులు  కలిపిన పాలు తాగితే రాత్రి కంటినిండా నిద్రపడుతుంది.

ఏలకులు నరాల మీద ప్రభావవంతంగా పనిచేస్తాయి.  నరాల బలహీనత ఉన్నవారికి చాలా మంచివి.