Share News

Health: బిజీ లైఫ్ లో ప్యాకెజ్డ్ ఫుడ్ కు అలవాటు పడ్డారా.. వెంటనే మానుకోండి.. లేకుంటే మాత్రం..

ABN , Publish Date - Mar 12 , 2024 | 09:42 PM

లైఫ్ స్టైల్ మారిపోయింది. బిజీ లైఫ్ లో కనీసం తినే ఆహారాన్ని కూడా వండుకోలేని పరిస్థితులు వచ్చేశాయి. ఇక వర్క్ చేసే దంపతులు, బ్యాచిలర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి కష్టాలు ఎలా ఉంటుందో ఊహించుకోగలం.

Health: బిజీ లైఫ్ లో ప్యాకెజ్డ్ ఫుడ్ కు అలవాటు పడ్డారా.. వెంటనే మానుకోండి.. లేకుంటే మాత్రం..

లైఫ్ స్టైల్ మారిపోయింది. బిజీ లైఫ్ లో కనీసం తినే ఆహారాన్ని కూడా వండుకోలేని పరిస్థితులు వచ్చేశాయి. ఇక వర్క్ చేసే దంపతులు, బ్యాచిలర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి కష్టాలు ఎలా ఉంటుందో ఊహించుకోగలం. అయితే ఇందుకు తగ్గట్టుగా సరికొత్త సౌకర్యాలు అందుబాటులోకి రావడం కాస్త ఉపశమనం కలిగించే విషయం. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ హవా నడుస్తోంది. ఆహారాన్ని సులభంగా పొందేందుకు ఆన్ లైన్ సదుపాయాలు గడప ముందుకు వచ్చేశాయి. ఒక్క క్లిక్ తో కావలసిన ఫుడ్ ను డెలివరీ చేసే సంస్థలు వేగంగా పుట్టుకొస్తున్నాయి. అంతే కాకుండా ప్యాకేజ్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ కూ విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అయితే ఆహార పదార్థాలు నిల్వ ఉండటానికి కొన్ని రసాయనాలను కలపక తప్పదు. ఇవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని తెలిసినా ఏమీ చేయలేని దౌర్భాగ్యం మనందరిది. నచ్చింది వండుకోలేక.. ప్యాకెట్ ఫుడ్ కు అలవాటు పడి రోగాలను కొని తెచ్చుకుంటున్నాం. ఈ వాస్తవం ఇప్పటికే తెలియకపోయినప్పటికీ.. భవిష్యత్ లో అది కలిగించే పరిణామాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయన్న విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరం చాలా ఉందని నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు.

ఆహార పదార్థాల్లో బ్యాక్టీరియా పెరుగుదలను నివారించడానికి ప్రాసెస్ చేసిన పదార్థాల్లో రసాయనాలను ఉపయోగిస్తుంటారు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌కి సమర్పించిన ఒక అధ్యయనంలో నైట్రేట్‌లు, నైట్రోసమైన్‌లను ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని గుర్తించారు. శుద్ధి చేసిన చక్కెరలో విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లు, కొవ్వులు లేదా ఫైబర్‌లు ఉండవు. వీటిలో కేలరీలు మాత్రమే అధికంగా ఉంటాయి. ఈ చక్కెరలను ఐస్ క్రీం, పేస్ట్రీలు, సోడా, డ్రింక్స్ లో ఉపయోగిస్తారు. మైదాను ప్రధానంగా ఫాస్ట్ ఫుడ్‌లో ఉపయోగిస్తారు. అటువంటి రసాయనాలు ఉన్న ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం చాలా అవసరం. మైదా స్థానంలో చిరుధాన్యాల తో చేసిన పిండిని ఉపయోగించడం ఉత్తమం.

నోట్.. ఇందులో పేర్కొన్ని విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 12 , 2024 | 09:42 PM