ABC Juice: వావ్.. ఎబిసి జ్యూస్ ఎప్పుడైనా తాగారా? రోజూ ఉదయాన్నే దీన్ని తాగితే ఎన్ని లాభాలంటే..!
ABN , Publish Date - Jan 04 , 2024 | 04:17 PM
ప్రతి రోజూ ఉదయాన్నే ఎబిసి జ్యూస్ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే షాకవుతారు.
శరీరం ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండటానికి ఆహారమే కాదు జ్యూసులు కూడా సహాయపడతాయి. బయట దొరికే కృత్రిమ జ్యూసుల కంటే ఇంట్లో తయారు చేసుకునే పండ్లు, కూరగాయల జ్యూసులు చాలా ఉత్తమం. చాలామంది ఆరోగ్యం కోసం ఉదయాన్నే జ్యూసులు తాగుతుంటారు. నారింజ, బత్తాయి, కీరా, క్యారెట్, ఉసిరి.. ఇలా ఉదయాన్నే తాగే జ్యూసుల లిస్ట్ చాలానే ఉంది. అయితే చాలామందికి ఎబిసి జ్యూస్ గురించి తెలియదు. యాపిల్, బీట్ రూట్, క్యారెట్.. మూడింటితో కలిపి చేసే జ్యూస్ ను ఎబిసి జ్యూస్ అని అంటారు. ప్రతి రోజూ ఉదయాన్నే ఎబిసి జ్యూస్ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే షాకవుతారు. అవేంటో తెలుసుకుంటే..
ఎబిసి జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ తో పోరాడటంలోనూ, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలోనూ సహాయపడతాయి. తద్వారా మొత్తం ఆరోగ్యానికి చాలా మంచిది.
ఇది కూడా చదవండి: రాత్రి పడుకునేముందు బొడ్డులో రెండు చుక్కల నూనె వేస్తే.. జరిగేదిదే..!
క్యారెట్, బీట్రూట్ లలో పొటాషియం సమృద్దిగా ఉంటుంది. ఇవి రక్తపోటును నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
క్యారెట్స్, యాపిల్స్ లోని ఫైబర్ జీర్ణ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది గట్ మైక్రోబయమ్ ను ప్రోత్సహిస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది.
బీట్రూట్ లలో డిటాక్సిఫైయింగ్ లక్షణాలు ఉంటాయి. ఇవి కాలేయాన్ని శుభ్రపరచడంలో సమర్థవంతంగా సహాయపడతాయి. కాలేయం పనితీరును మెరుగుపరుస్తాయి.
యాపిల్స్, క్యారెట్లలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరం అనారోగ్యానికి గురైనప్పుడు ఎబిసి జ్యూస్ తాగితే వేగంగా కోలుకుంటారు. ఇన్పెక్షన్ల నుండి కూడా బయటపడతారు.
ఇది కూడా చదవండి: జాగ్రత్త.. ఉప్పు ఎక్కువ తింటే హై బీపీనే కాదు.. ఈ నష్టాలు ఉంటాయి!
ఎబిసి జ్యూస్ లోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు కలిసి రక్తాన్ని శుద్ది చేస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా మారుస్తాయి. ముడుతలు, మచ్చలు తగ్గిపోతాయి. వయసు పెరిగినా యవ్వనంగా కనిపిస్తారు.
క్యారెట్లలో బీటా-కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది విటమిన్-ఎ తయారు కావడానికి దోహదం చేస్తుంది. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఇది కూాడా చదవండి: Water Fasting: బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నారా? ఈ ట్రిక్ ఫాలో అయితే షాకింగ్ ఫలితాలుంటాయి!
(గమనిక: ఇది ఆహార నిపుణులు, వైద్యులు పలుచోట్ల పేర్కొన్న అంశాల ఆధారంగా రూపొందించబడిన కథనం. ఆరోగ్యం గురించి ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించడం మంచిది.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.