Share News

Lok Sabha Elections 2024:నామినేషన్ వేసిన అనంతరం రఘురామిరెడ్డి కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Apr 25 , 2024 | 03:34 PM

ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ (Congress) అభ్యర్థిగా రామసహాయం రఘురామిరెడ్డి (Raghuram Reddy) గురువారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. ఖమ్మం కలెక్టరేట్‌లో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ వీవీ గౌతమ్‌‌కు నామినేషన్‌ పత్రాలను అందజేశారు.

 Lok Sabha Elections 2024:నామినేషన్ వేసిన అనంతరం రఘురామిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Raghuram Reddy

ఖమ్మం: ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ (Congress) అభ్యర్థిగా రామసహాయం రఘురామిరెడ్డి (Raghuram Reddy) గురువారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. ఖమ్మం కలెక్టరేట్‌లో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ వీవీ గౌతమ్‌‌కు నామినేషన్‌ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించిన కాంగ్రెస్ అగ్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తనది ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మ తన స్వగ్రామమని చెప్పారు. తమ భూములను ప్రజల కోసం దానం చేశామని అన్నారు. బీజేపీ పాలనలో దేశ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరలు అంతులేకుండా పెరిగిపోయాయని ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్‌ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేశారని ఆరోపించారు. దేశానికి కాంగ్రెస్ ప్రభుత్వం అవసరం ఉందని ఉద్ఘాటించారు. తనకు ఎంపీగా ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. తనను ఎంపీగా గెలిపిస్తే జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని వివరించారు. తన జీవితాన్ని ఖమ్మం ప్రజలకు అంకితం చేస్తానని రఘురామిరెడ్డి పేర్కొన్నారు.


Lok Sabha Polls: తెలంగాణను ఢిల్లీ ఏటీఎంగా మార్చారు.. కాంగ్రెస్ నేతలపై షా ఫైర్!

కాగా.. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి విషయంలో ఎన్నో పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ చివరికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు రామసహాయం రఘురామిరెడ్డిని ఏఐసీసీ నిన్న(బుధవారం) ప్రకటించిన విషయం తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌కు సంబంధించి నామినేషన్లు దాఖలు చేసే గడువు నేడు(గురువారం)తో ముగియనున్నది. దీంతో రఘురామిరెడ్డి ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. అయితే చివరి నిమిషం వరకు ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విషయంలో ఎంతో ఉత్కంఠత నెలకొంది. రఘురామిరెడ్డిని ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టడంతో ఆశావాహులకు ఈ సీటు విషయంలో నిరాశే మిగిలింది.


Minister Uttam: జస్టిస్ చంద్ర ఘోష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి ఉత్తమ్

ఈ సీటు కోసం రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి, మంత్రి భట్టి విక్రమార్క భార్య నందిని, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగంధర్ ఈ సీటు కోసం పోటీ పడ్డారు. అయితే రెండు రోజుల క్రితం రఘురామిరెడ్డి పేరును ఏఐసీసీ ప్రకటించకుండానే నామినేషన్ వేయడం గమనార్హం. ఏఐసీసీ సూచించడంతోనే మంత్రి పొంగులేటి తన అనుచరులతో రఘురామిరెడ్డి పేరు మీద నామినేషన్ వేయించారని జోరుగా చర్చించుకున్నారు. నిన్నటి ఏఐసీసీ ప్రకటనతో మంత్రి పొంగులేటి తన పంతం నెగ్గించుకున్నట్లు అయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


CM Revanth: రిజర్వేషన్లు కావాలా?.. వద్దా? అనేదానికి ఈ ఎన్నికలే రెఫరెండం

Read Latest Election News or Telugu News

Updated Date - Apr 25 , 2024 | 04:04 PM