Share News

Kejriwal:నేనేమి ఉగ్రవాదిని కాదు, జైలు నుంచి కేజ్రీవాల్ సందేశం.. బీజేపీ కౌంటర్

ABN , Publish Date - Apr 16 , 2024 | 03:38 PM

లిక్కర్ స్కామ్‌లో అరెస్టై తీహర్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై వరసగా విమర్శలు చేస్తున్నారు. జైలులో తనను ఎక్కువగా టార్గెట్ చేశారని, 24 గంటల పాటు నిఘా ఉంచారని, రోజువారి కార్యకలపాలు, సమావేశాలపై కూడా దృష్టిసారించారని మండిపడ్డారు.

Kejriwal:నేనేమి ఉగ్రవాదిని కాదు, జైలు నుంచి కేజ్రీవాల్ సందేశం.. బీజేపీ కౌంటర్
Arvind Kejriwal Sends Not A Terrorist Message From Jail BJP Responds

ఢిల్లీ: లిక్కర్ స్కామ్‌లో అరెస్టై తీహర్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కేంద్ర ప్రభుత్వంపై వరసగా విమర్శలు చేస్తున్నారు. ‘జైలులో ఉండటంతో తనను ఎక్కువగా టార్గెట్ చేశారు. 24 గంటల పాటు నిఘా ఉంచారు. రోజువారి కార్యకలాపాలు, సమావేశాలపై కూడా దృష్టిసారించారు. ఏ ఒక్కరితో మాట్లాడిన అనుమానంగా చూస్తున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడితే కూడా అలాగే చూస్తున్నారు. నేను ఢిల్లీ ప్రజల కోసం కొడుకులా, సోదరుడిలా పని చేశా. నా పేరు అరవింద్ కేజ్రీవాల్. నేనేమి ఉగ్రవాదిని కాదు. ఇలా ప్రవర్తించడానికి మీకు సిగ్గుగా లేదా..? నా భార్యతో సమావేశమైన సమయంలో, కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న ప్రధాని మోదీకి నచ్చడం లేదు అని’ జైలు నుంచి ప్రజలకు కేజ్రీవాల్ సందేశం ఇచ్చారు.

Ramdev Baba: మీరంత అమాయకులేం కాదు.. రాందేవ్‌పై సుప్రీం ఫైర్


‘జైలులో కేజ్రీవాల్‌తో సతీమణీ సునీత మాట్లాడే సమయంలో గాజు గోడను ఏర్పాటు చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్- కేజ్రీవాల్ మధ్య అదేవిధంగా మీటింగ్ జరిగింది. ప్రధాని మోదీ హృదయం ద్వేషంతో నిండిపోయింది. ఓ ముఖ్యమంత్రితో మీరు ఈ విధంగా నడుచుకుంటారా..? జైలులో కావాలనే వేధింపులకు గురి చేస్తున్నారు. కేజ్రీవాల్ కుటుంబ సభ్యులను ఎలా అవమానించాలి..? పార్టీ నేతలను ఎలా కించపరచాలి అని నిత్యం ఆలోచిస్తున్నారు. ఐఆర్ఎస్ ఉద్యోగం వదిలేసి ప్రజలకు సేవ చేసేందుకు కేజ్రీవాల్ రాజకీయాల్లోకి వచ్చారు. ఉద్యోగానికి రాజీనామా చేసిన 49 రోజుల తర్వాత అధికారం చేపట్టారు. కేజ్రీవాల్ అంటే అది. మీరు అతన్ని పడగొట్టాలని చూస్తే.. మరింత శక్తిమంతం అవుతారు అని’ ఆప్ నేత సంజయ్ సింగ్ స్పష్టం చేశారు.


ఆప్ ఆరోపణలపై బీజేపీ స్పందించింది. ‘అరవింద్ కేజ్రీవాల్‌ను ఉగ్రవాది అనడం లేదు. కేజ్రీవాల్, అతని సహచరులు ఉగ్రవాది అని ఎందుకు పిలుస్తున్నారో తెలియడం లేదు. కేజ్రీవాల్‌ని అవినీతి పరుడని అంటున్నాం. కేజ్రీవాల్‌ ఢిల్లీకి శత్రువు. పెన్షన్ల కోసం వృద్దులను ఇబ్బందికి గురిచేశాడు. రేషన్ కార్డుల కోసం పేదలను, స్వచ్చమైన నీరు, గాలి కోసం ప్రజలను ఇబ్బందుల పాలు చేశాడు అని’ బీజేపీ ఎంపీ మనోజ్ తివార్ ఆప్ నేతల ఆరోపణలను ధీటుగా తిప్పి కొట్టారు. జైలులో అందరికీ ఒకేలా వెసులుబాట్లు ఉంటాయని, కావాలనే ఆరోపణలు చేయడం సరికాదని మండిపడ్డారు.

Bangalore: దుమారం రేపిన మాజీసీఎం కుమారస్వామి వ్యాఖ్యలు..

మరిన్ని జాతీయ వార్తల కోసం

Updated Date - Apr 16 , 2024 | 04:38 PM