Share News

AP Election 2024: ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నామినేషన్‌పై వీడిన ఉత్కంఠ

ABN , Publish Date - Apr 26 , 2024 | 06:55 PM

నంద్యాల జిల్లాలోని డోన్ నియోజకవర్గం నుంచి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి దాఖలు చేసిన నామినేషన్‌‌పై ఉత్కంఠ వీడింది. నామినేషన్ పత్రంలో ఆస్తుల వివరాలు పొందుపరచలేదంటూ అందిన ఫిర్యాదు మేరకు పెండింగ్‌లో పెట్టినట్టు వార్తలు వచ్చినప్పటికీ.. బుగ్గన నామినేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆమోదించారు.

AP Election 2024: ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నామినేషన్‌పై వీడిన ఉత్కంఠ

డోన్: నంద్యాల జిల్లాలోని డోన్ నియోజకవర్గం నుంచి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి దాఖలు చేసిన నామినేషన్‌‌పై ఉత్కంఠ వీడింది. నామినేషన్ పత్రంలో ఆస్తుల వివరాలు పొందుపరచలేదంటూ అందిన ఫిర్యాదు మేరకు పెండింగ్‌లో పెట్టినట్టు వార్తలు వచ్చినప్పటికీ.. బుగ్గన నామినేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆమోదించారు.

నామినేషన్ పత్రంలో ఆస్తుల వివరాలు పొందుపర్చలేదని, కొన్ని కాలమ్స్ పూర్తి చేయలేదని టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో సాయంత్రం 5 గంటలలోగా సమాధానం ఇవ్వాలని బుగ్గన న్యాయవాదులకు ఆర్వో నోటీసులు జారీ చేశారు.


బుగ్గన లాయర్లు ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందిన ఆర్‌వో చివరి నిమిషంలో నామినేషన్‌ను ఆమోదించారు. అయితే తమకు తెలియజేయకుండా నిబంధనలకు విరుద్ధంగా మంత్రి బుగ్గన నామినేషన్‌ను ఎన్నికల అధికారి ఆమోదించారని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అడ్వకేట్స్ ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

పిఠాపురానికి కడప రౌడీలు.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు

AP Election 2024: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ సంచలన ఆరోపణలు

Read Related Election news and Telugu News

Updated Date - Apr 26 , 2024 | 08:00 PM