Share News

AP Election: చంద్రబాబు, లోకేష్‌పై కేసులు.. ఎన్నంటే..?

ABN , Publish Date - Apr 17 , 2024 | 09:07 PM

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, యువ నేత నారా లోకేష్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నమోదు చేసిన కేసుల వివరాలపై స్పష్టత వచ్చింది. చంద్రబాబు, లోకేష్‌పై చెరో 23 కేసుల చొప్పున పోలీసులు నమోదు చేశారు. ఆ వివరాలను తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ పరిశీలించింది. చంద్రబాబుపై సీఐడీ కేసులు 8 ఉన్నాయి. మిగతా 15 కేసులు జిల్లాల్లో నమోదు చేశారు.

AP Election: చంద్రబాబు, లోకేష్‌పై కేసులు.. ఎన్నంటే..?
Chandrababu And Lokesh Total Cases Are 46

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu), యువ నేత నారా లోకేష్‌పై (Lokesh) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నమోదు చేసిన కేసుల వివరాలపై స్పష్టత వచ్చింది. చంద్రబాబు, లోకేష్‌పై చెరో 23 కేసుల చొప్పున పోలీసులు నమోదు చేశారు. ఆ వివరాలను తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ పరిశీలించింది. చంద్రబాబుపై సీఐడీ కేసులు 8 ఉన్నాయి. మిగతా 15 కేసులు జిల్లాల్లో నమోదు చేశారు. నారా లోకేష్‌పై ఒక సీడీఐ కేసు ఉంది. మిగతా 22 కేసులు జిల్లాల్లో నమోదు చేశారు. ఇవన్ని దాదాపు యువగళం పాదయాత్ర చేసే సమయంలోనే ఫైల్ చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత చంద్రబాబు, లోకేష్‌పై ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. అంతకుముందు ఇద్దరు నేతలు ఒక్క కేసు కూడా లేదు. మరికొద్దిరోజుల్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ పత్రంలో కేసుల వివరాలను పొందుపరిచేందుకు చంద్రబాబు, నారా లోకేష్ కేసుల వివరాలను తెలుగుదేశం పార్టీ సేకరించింది. ఇదివరకు తమపై ఒక్క కేసు లేదని, తన రాజకీయ జీవితం తెరచిన పుస్తకం అని చంద్రబాబు నాయుడు పలు సందర్భాల్లో ప్రకటించారు.

AP Election 2024: వైసీపీపై మూకుమ్మడి దాడి చేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్

మరిన్ని ఏపీ వార్తల కోసం

Updated Date - Apr 17 , 2024 | 09:07 PM