Share News

AP Election 2024: నేతలకు పార్టీలు శాశ్వతం కాదంటే ఇదేనేమో!.. వీరశివారెడ్డి రూటే వేరబ్బ...

ABN , Publish Date - Apr 29 , 2024 | 11:25 AM

మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి రూటే వేరబ్బ అంటూ పొలిటికల్‌ హీట్‌లో చర్చ నడుస్తోంది. మూడు నెలల్లోనే వీరశివారెడ్డి 2 పార్టీల అధినేతల సమక్షంలోనే కండువా కప్పుకోవడం చర్చనీయాంశమైంది. వీరశివారెడ్డి కమలాపురం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

AP Election 2024: నేతలకు పార్టీలు శాశ్వతం కాదంటే ఇదేనేమో!.. వీరశివారెడ్డి రూటే వేరబ్బ...

  • మూడు నెలల్లో రెండు పార్టీల్లోకి చేరిక

(కడప - ఆంధ్రజ్యోతి): మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి రూటే వేరబ్బ అంటూ పొలిటికల్‌ హీట్‌లో చర్చ నడుస్తోంది. మూడు నెలల్లోనే వీరశివారెడ్డి 2 పార్టీల అధినేతల సమక్షంలోనే కండువా కప్పుకోవడం చర్చనీయాంశమైంది. వీరశివారెడ్డి కమలాపురం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019ఎన్నికల్లో టీడీపీలోకి వచ్చిన ఆయన కమలాపురం టికెట్‌ ఆశించారు. అయితే చివరి నిమిషంలో వైసీపీలోకి జంప్‌ అయిపోయారు. మళ్లీ ఐదేళ్ల తర్వాత జనవరి చివరి వారంలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.


కమలాపురం టికెట్‌ ఆశించి భంగపడ్డారు. ఇటీవలే ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి, టీడీపీ నేత బీద రవిచంద్ర వీరశివారెడ్డితో ప్రొద్దుటూరులో మంతనాలు జరిపారు. ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి సముచిత స్థానం కల్పిస్తే టీడీపీలో కొనసాగుతామని హామీ ఇచ్చారు. అయితే 25న పులివెందులలో సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సరిగ్గా 2019లో ఇలాగే టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్‌ అయ్యారు. ఈసారి కూడా సేమ్‌సీన్‌ రిపీట్‌ కావడంతో ఎంతైనా వీరశివారెడ్డి రూటే వేరబ్బా అంటున్నారు.

ఇవి కూడా చదవండి

AP Elections: వైసీపీ చివరి అస్త్రం ఇదే.. పైసలపైనే జగనన్న నమ్మకం..

AP Election 2024: ఓట్ల వేటలో రూ.కోట్లు.. బేరం చేస్తున్న వైసీపీ

Read Latest AP News and Telugu News

Updated Date - Apr 29 , 2024 | 11:26 AM