Share News

TS Inter Results 2024: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల.. ఇక్కడ చెక్ చేసుకోండి..

ABN , Publish Date - Apr 24 , 2024 | 10:43 AM

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు(Telangana Inter Results) విడుదలయ్యాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి విడుదల చేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ బోర్డు((Telangana State Board of Intermediate Education) కార్యాయలంలో విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం ఈ ఫలితాలను..

TS Inter Results 2024: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల.. ఇక్కడ చెక్ చేసుకోండి..
TS Inter Results

హైదరాబాద్‌, ఏప్రిల్ 24: తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు(Telangana Inter Results) విడుదలయ్యాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి విడుదల చేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ బోర్డు((Telangana State Board of Intermediate Education) కార్యాయలంలో విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాలను ఆంధ్రజ్యోతి వెబ్‌సైట్‌లో విద్యార్థులు చెక్ చేసుకోవచ్చు. అలాగే.. ప్రభుత్వం ప్రకటించిన అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in, results.cgg.gov.in లో విద్యార్థులు తమ మార్కులను చెక్ చేసుకోవచ్చు.


ఇంటర్‌లో ఈ జిల్లా ఫస్ట్..

ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 60.01 శాతం, ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 64.16 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 71.7 శాతంతో మొదటి స్థానంలో రంగారెడ్డి జిల్లా నిలవగా.. 34. 81 శాతంతో కామారెడ్డి ఆఖరి స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్ ఫలితాల్లో 81 శాతంతో ములుగు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 44.29 శాతంతో కామారెడ్డి ఆఖరి స్థానంలో నిలిచింది. ఇక ఇంటర్మీడియట్ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు.


బాలికలదే పైచేయి..

ఇంటర్మీడియట్ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 68.35 శాతం మంది బాలికలు పాస్ అవగా.. బాలురు 51.50 శాతం మంది పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్‌లో 72.53 శాతం మంది బాలికలు పాస్ అవగా.. 56.10 శాతం మంది బాలురు పాస్ అయ్యారు.


మార్క్స్ షీట్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

సాయంత్రం 5 గంటల నుండి అన్‌లైన్‌లో మార్కులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు. రీ కౌంటీగ్, రీ వాల్యూయేషన్ చేసుకునే విద్యార్థులకు ఏప్రిల్ 25వ తేదీ నుంచి మే 2 వరకు అవకాశం ఇచ్చారు. మే 24వ తేదీ నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డ్ అధికారులు ప్రకటించారు.


ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు పరీక్షలు..

తెలంగానలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు జరిగాయి. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 9,80,978 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షల మూల్యాంకనం పూర్తవగా.. ఇప్పుడు రిజల్ట్స్ ప్రకటించింది ఇంటర్మీడియట్ బోర్డ్. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఒకేషన్ కోర్స్ విద్యార్థుల ఫలితాలను కూడా వెల్లడించింది. మరోవైపు ఇదే నెలలో తెలంగాణ టెన్త్ ఫలితాలు కూడా విడుదల కానున్నాయి. ఏప్రిల్ 30వ తేదీన గానీ.. మే 1వ తేదీన గానీ ప్రకటించే అవకాశం ఉంది.

For More Education News and Telugu News

Updated Date - Apr 24 , 2024 | 11:49 AM