Share News

Nellore: రక్షకులే భక్షకులవుతున్నారు.. జాతీయ రహదారిపై యథేచ్ఛగా ఖాకీల దుశ్చర్య..

ABN , Publish Date - Jan 25 , 2024 | 12:41 PM

రక్షణగా ఉండాల్సిన పోలీసులు.. భక్షకులుగా మారుతున్నారు. ఖాకీ దుస్తులను అడ్డు పెట్టుకుని అక్రమాలకు తెర లేపుతున్నారు. చేతితో లాఠీ పట్టుకుని లా అండ్ ఆర్జర్ ను బ్రేక్ చేస్తున్నారు.

Nellore: రక్షకులే భక్షకులవుతున్నారు.. జాతీయ రహదారిపై యథేచ్ఛగా ఖాకీల దుశ్చర్య..

రక్షణగా ఉండాల్సిన పోలీసులు.. భక్షకులుగా మారుతున్నారు. ఖాకీ దుస్తులను అడ్డు పెట్టుకుని అక్రమాలకు తెర లేపుతున్నారు. చేతితో లాఠీ పట్టుకుని లా అండ్ ఆర్జర్ ను బ్రేక్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో పోలీసుల తీరుకు నేరగాళ్లే కాదు.. అమాయక ప్రజలూ భయపడాల్సిన పరిస్థితి దాపురించిందని జిల్లా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మర్రిపాడులో జాతీయ రహదారిపై పోలీసులు యథేచ్ఛగా అక్రమ వసూళ్లకు పాల్పడుతుండటం విస్మయం కలిగిస్తోంది. చికెన్ వ్యర్ధాలు తరలించే బండ్లు, ఇసుక లారీల నుంచి అక్రమంగా వసూలు చేస్తున్నారు. వీటి అక్రమ రవాణాకు ప్రతి నెలా లక్షల రూపాయలు అందుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తుండటం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో కొంతమంది కిందిస్థాయి సిబ్బంది అడ్డగోలుగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. నిషేధిత ఖైనీ, గుట్కా వ్యాపారులు, నాటుసారా తయారీ, అమ్మకందారులు, ప్రధాన రహదారుల పక్కన వుండే హోటళ్లు/ రెస్టారెంట్ల నిర్వాహకులు, ఇలా పలు రంగాల వ్యాపారులు, వ్యక్తుల నుంచి నెలవారీ మామూళ్లు దండుకుంటున్నారు. విధుల నిర్వహణకన్నా ‘కలెక్షన్ల’పైనే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారన్న విమర్శలను ఎదుర్కొంటున్నారు.

Updated Date - Jan 25 , 2024 | 12:41 PM