Share News

Chandrababu: ఏపీ ఫలితాలపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్ ఇదే..

ABN , Publish Date - May 29 , 2024 | 01:43 PM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ తర్వాత సైలెంట్‌గా ఉన్న టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు (Chandrababu) తొలిసారి స్పందించారు. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి..? అనేదానిపై..

Chandrababu: ఏపీ ఫలితాలపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్ ఇదే..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ తర్వాత సైలెంట్‌గా ఉన్న టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు (Chandrababu) తొలిసారి స్పందించారు. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి..? అనేదానిపై ఒకే ఒక్క మాటలో చెప్పేశారు. అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు.. టీడీపీ ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

అప్రతమత్తంగా ఉండండి!

ఈ నెల 31న 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజక వర్గాల చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో సమావేశం నిర్వహించనున్నట్టు చంద్రబాబు తెలిపారు. నేడు అమెరికా నుంచి వచ్చీ రాగానే చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పలు కీలక అంశాలపై సూచనలు చేశారు. జూన్ 1వ తేదీన జోనల్ స్థాయిలో కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ రెండు కార్యక్రమాలకు వెంటనే ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. పోస్టల్ బ్యాలెట్‌ల విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

AP Elections 2024: షాకింగ్.. పోస్టల్ బ్యాలెట్‌ పత్రంపై ఇలా చేసుంటే ఆ ఓట్లు చెల్లవు!


వైసీపీ ఓటమికి కారణాలు

పోస్టల్ బ్యాలెట్‌లపై వెంటనే వైసీపీ చేస్తున్న రాద్దాంతం పట్ల అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఓటమికి వైసీపీ నేతలు కారణాలు వెతుకుతున్నారని చంద్రబాబు అన్నారు. ఎన్నికల కమిషన్, పోలీసుల తీరుపై అందుకే విమర్శలు చేస్తున్నారని నేతలు చెప్పారు. కౌంటింగ్ రోజు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఈసీకి, డీజీపీ కు లేఖ రాయాలని టీడీపీ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి అబ్జర్వర్‌ను నియమించాలని టీడీపీ డిమాండ్ చేసింది. 175 నియోజకవర్గాలకు 120 మంది మాత్రమే పరిశీలకులను నియమించడం పట్ల టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంటనే అన్ని నియోజకవర్గాలకు పరిశీలకులను నియమించాలని లేఖ రాయాలని చంద్రబాబు నిర్ణయించారు. రేపు సాయంత్రం అమరావతికి చంద్రబాబు బయలుదేరనున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

బీఆర్ఎస్ హయాంలోనే మాయ చేసిన మిల్లర్లు

ఏపీలో పెన్షన్ల టెన్షన్..

జవహర్‌ రెడ్డి సర్వభ్రష్టత్వం!

Read Latest AP News and Telugu News

Updated Date - May 29 , 2024 | 02:54 PM