Share News

Election Campaign: పవన్ కళ్యాణ్ నరసాపురం పర్యటన.. భారీ ఏర్పాట్లు

ABN , Publish Date - Apr 21 , 2024 | 11:02 AM

పశ్చిమ గోదావరి: ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆదివారం నుంచి రెండు రోజులపాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించ నున్నారు. ఎన్డీఏ కూటమి తరపున జనసేన పోటీ చేసే నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు.

Election Campaign: పవన్ కళ్యాణ్ నరసాపురం పర్యటన.. భారీ ఏర్పాట్లు

పశ్చిమ గోదావరి: ఎన్నికల ప్రచారంలో (Election Campaign) భాగంగా జనసేన (Janasena) అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఆదివారం నుంచి రెండు రోజులపాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari Dist.)లో పర్యటించ నున్నారు. ఎన్డీఏ కూటమి (NDA Kutami) తరపున జనసేన పోటీ చేసే నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు. ఆదివారం పిఠాపురం నుంచి హెలీ కాఫ్టర్‌లో నర్సాపురం చేరుకుంటారు. అంబేద్కర్ సెంటర్‌లో జరగనున్న బహిరంగ సభకు ఆయన హాజరుకానున్నారు. అనంతరం నరసాపురం (Narasapuram) నుంచి మొగల్తూరు (Mughaltur) మీదుగా భీమవరం (Bhimavaram) వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు భీమవరంలో జరిగే బహిరంగ సభలో పవన్ పాల్గొని ప్రసంగించనున్నారు. రాత్రికి పవన్ అక్కడే బస చేస్తారు. కాగా నరసాపురం బహిరంగ సభ విజయవంతం చేయాలని ఆ పార్టీ అభ్యర్థి బొమ్మిడి నాయకర్‌, పొత్తూరి రామరాజు, మేకల సతీష్‌ కూటమి నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.


సోమవారం ఉదయం తాడేపల్లి గూడెం ఉంగుటూరులో పవన్ కల్యాణ్ రోడ్ షోలు, బహిరంగ సభలలో పాల్గొననున్నారు. తాడేపల్లిగూడెం బహిరంగ సభ, రూట్‌ మ్యాప్‌ తదితర అంశాలపై కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్‌ సమీక్షించారు. సభకు భారీ సంఖ్యలో నాయకులు కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు.


కాగా గణపవరంలో ఈనెల 22న జరిగే జనసేనాని పవన్‌ కల్యాణ్‌ పర్యటన విజయవంతం చేయాలని జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు పిలుపునిచ్చారు. స్థానిక జనసేన కార్యాలయంలో శనివారం జరిగిన కూటమి కార్యకర్తల సమావేశంలో జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి పత్సమట్ల ధర్మరాజు, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్‌ శరణాల మాలతీరాణి, నియోజకవర్గ జనసేన పరిశీలకుడు వట్టి పవన్‌ కుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆయా మండలాల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సూచించారు. 22న ఏలూరులో జరిగే ఎన్‌డీఏ కూటమి అభ్యర్ధి పుట్టా మహేష్‌ కుమార్‌ నామినేషన్‌ కార్యక్రమానికి, 23న జరిగే పత్సమట్ల ధర్మరాజు నామినేషన్‌ కార్యక్రమానికి మూడు పార్టీల కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రంగారెడ్డి జిల్లా: నడుస్తున్న కారులో మంటలు..

వెంకటగిరి టిక్కెట్టు విషయంలో టీడీపీ కీలక నిర్ణయం

రాయి తగిలితే హత్యాయత్నం.. గొడ్డలితో నరికితే గుండెపోటా?

పరారే.. పరారే.. పరిశ్రమలు పరారే!

Updated Date - Apr 21 , 2024 | 11:08 AM