Share News

Sunkara Padmasri: విజయవాడ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్నా

ABN , Publish Date - Apr 23 , 2024 | 09:59 AM

విజయవాడ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా పోటీ చేయాలని ఆశించానని ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ పేర్కొన్నారు. కొన్ని కారణాలతో అధిష్టానం అవకాశం కల్పించలేక పోయిందన్నారు. తనను సంప్రదించకుండానే విజయవాడ తూర్పు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థినిగా ప్రకటించిందని వెల్లడించారు.

Sunkara Padmasri: విజయవాడ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్నా

విజయవాడ: విజయవాడ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా పోటీ చేయాలని ఆశించానని ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ పేర్కొన్నారు. కొన్ని కారణాలతో అధిష్టానం అవకాశం కల్పించలేక పోయిందన్నారు. తనను సంప్రదించకుండానే విజయవాడ తూర్పు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థినిగా ప్రకటించిందని వెల్లడించారు. తనకు అసలు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచనే లేదని తెలిపారు. పార్టీ కోసం, పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు. తాను తీసుకున్న నిర్ణయానికి అధిష్టానం సహృదయంతో సహకరిస్తుందని భావిస్తున్నానని సుంకర పద్మశ్రీ తెలిపారు.

మోదీకి ఓటమి భయం

AP Elections: పెందుర్తిలో పాగా వేసేదెవరు..?

Read More AP News and Telugu News

Updated Date - Apr 23 , 2024 | 10:00 AM